twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో రజనీకాంత్ సతీమణి, ఆ సినిమా పుణ్యమే.. 6 కోట్లు ఎగ్గొట్టి ఆడుకుంటున్నారా!

    |

    Recommended Video

    Rajinikanth Wife Latha Rajini Kanth Faces A Issue

    2014 లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడియాన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని దర్శకురాలు. మోషన్ క్యాప్చర్ విధానంతో ఇండియాలోనే ఆమె తొలిసారి ఈ చిత్రాన్ని రూపొందించారు. రజనీలాంటి సూపర్ స్టార్ తో ఈ ప్రయోగం చేయడంతో దారుణంగా బెడిసికొట్టింది. బయ్యర్లు కూడా పీకల్లోతు చిక్కుల్లో మునిగిపోయారు. ఈ చిత్రం ఎఫెక్ట్ రజిని ఫ్యామిలీపై ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. తాజగా సుప్రీం కోర్టు రజని సతీమణి లతా రజనీకాంత్ తీరుని తీవ్రంగా తప్పుబట్టింది.

    ఏదో అనుకుని ఇంకేదో

    ఏదో అనుకుని ఇంకేదో

    మోషన్ క్యాప్చర్ విధానాన్ని సౌందర్య రజనీకాంత్ తొలి సరి ఉపాయోగించడంతో ఈ చిత్రం భారీగా యాక్షన్ సన్నివేశాలతో ఉంటుందని అంతా భావించారు. కానీ చివరకు చిన్నపిల్లలు ఆనందించే యానిమేషన్ చిత్రం బయటకు వచ్చింది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

    14 కోట్ల లోన్

    14 కోట్ల లోన్

    ఈ చిత్రాన్ని రజనీ కుటుంబమే నిర్మించడం విశేషం. లతా రజనీకాంత్ ఈ చిత్రం కోసం బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ నుంచి 14 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇప్పటికి ఆ లోన్ కు సంబందించిన 6 కోట్ల బకాయిలు అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

    మూడు నెలల గడువు అయినా

    మూడు నెలల గడువు అయినా

    ఈ వ్యవహారంలో సదరు సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆ సమయంలోన్యాయస్థానం లతా రజనీకాంత్ కు మూడు నెలల గడువు ఇచ్చారు. ఆ లోపు బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.

    ఆడుకుంటున్నారా

    ఆడుకుంటున్నారా

    ఇప్పటికి లతా రజనీకాంత్ మిగిలిన 6 కోట్లు చెల్లించకపోవడంతో న్యాయస్థానం చివాట్లు పెట్టింది. న్యాయస్థానంతో ఆటలాడుకుంటే పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది.

    English summary
    Latha Rajinikanth pulled up by SC over non-payment of dues. Kochadaiiyaan movie issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X