twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్కని టార్చర్ పెట్టలేదని ఖండన

    By Srikanya
    |

    అనుష్క రీసెంట్ గా ప్రభాస్ చేస్తున్న రెబెల్ ప్రాజెక్టునుంచి బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు రకరకాలుగా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. లారెన్స్ తన కాంచన లో ఆమె నటించలేదనే విషయం మనస్సులో పెట్టుకని ఆమెను సాధిస్తున్నాడని, ముఖ్యంగా బాగా లావు అయిందని, తగ్గాలని ఒత్తిడి తెచ్చి ఆమెను మానసికంగా టార్చర్ పెట్టడమే కారణమని చెప్పుకుంటున్నారు. అయితే లారెన్స్ ఇవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసారు. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ అనుష్కతో మనస్పర్థలు లేవన్నారు. రెబల్ చిత్రం నుంచి ఆమె వైదొలగడానికి కారణం కాల్‌షీట్స్ సమస్యేనన్నారు.

    అనుష్కతో రెండురోజులు షూటింగ్ కూడా చేశామని, టాలీవుడ్‌లో సమ్మె కారణంగా చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్స్ వాయిదాపడిందన్నా రు. దీంతో ఆమెకు కాల్‌షీట్స్ సమస్య తలెత్తిందన్నారు. అంతేగానీ తానేదో ఆమెను బరువు తగ్గమని ఒత్తిడి తెచ్చినట్లు, అందుకే వైదొలగి నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అయితే కాంచన చిత్రం అనుష్క లేకపోవటం వల్లే అంత పెద్ద హిట్టైందని కావాలని ఆమెకు తెలిసేలా మాట్లాడటం వంటివి చేయటం లారెన్స్ చేసి ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. ఇక అనుష్క తో లారెన్స్ ఇలా మిస్ బిహేవ్ చేయటం నచ్చని నాగార్జున ఆమెను బయిటకు వచ్చేమని చెప్పాడని, లారెన్స్ కు వార్నింగ్ లాంటిది సైతం ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు లారెన్స్ కు ప్రభాస్ సరసన హీరోయిన్ ని తేవటం పెద్ద సమస్యగా మారింది. పెద్ద హీరోయిన్స్ ఎవరూ లారెన్స్ సినిమా అంటే భయపడిపోతున్నారు.

    English summary
    Lawrence clarifies about differences with Anushka and why she herself quit from the Rebel project..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X