'రోబో'శంకర్ దర్శకత్వంలో లారెన్స్
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లారెన్స్ నటించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రి ఇడియట్స్ రీమేక్ లో ఈ సంఘటన చోటు చేసుకోనుంది. ఈ విషయమై లారెన్స్ చాలా ఆనందంగా ఉన్నాడు. దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో చేయటం తన అదృష్టం గా భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఖుషీ దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా గెస్ట్ రోల్ లో కనపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో త్రీ రాస్కెల్స్ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన షూటింగ్ నెదర్లాండ్స్ లో జరుగుతోంది. హిందీలో సూపర్ హిట్టైన ఈ చిత్రం తెలుగు, తమిళంలోనూ అదే రేంజి విజయాన్ని నమేదు చేస్తుందని భావిస్తున్నారు. హిందీ వెర్షన్ లో జావేద్ జాఫ్రీ పోషించిన పాత్రను లారెన్స్ ఇందులో పోషిస్తాడు. కోటీశ్వరుడి కొడుకుగా కామెడీ పండించే క్యారెక్టర్ ఇది. ఇంటర్వెల్ ముందు వస్తుంది. విజయ్, శ్రీరామ్, జీవా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. సత్యరాజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రొపెసర్ పాత్రలో జీవించనున్నారు.


Click it and Unblock the Notifications











