'మాస్' సినిమాతో డైరక్టర్ అయిన కొరియోగ్రాఫర్ లారెన్స్ . అతను మొన్న 'పార్ధు' సినిమాతో జనాన్ని పరారు అయ్యేలా బెదిరించాడు. తాజాగా అతను ఓ తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. శక్తి చిదంబరం అనే మాస్ మసాలా డైరక్టర్ కి లారెన్స్ తో చెయ్యాలని ఎప్పటినుంచో కోరికట. దాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఇక ఆ సినిమాలో తన అభిమాన హీరోకి అరడజను మంది హీరోయిన్లు, మరో అరడజన్ మంది విలన్స్ ని పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే డాన్సుల్లో,రొమాన్స్ పండించటంలోనే కాక ఇప్పుడు సెంటిమెంటు, ఫైట్స్ లలో కూడా అధ్భుతమనిపిస్తున్నాడట. దాంతో అతన్ని ఒప్పించి సినిమా చేస్తున్నాడుట. ఇంకేం త్వరలోనూ ఆ సినిమా మన ధియోటర్స్ ని డబ్బింగై పలకరిస్తుంది. మనమూ ఆ విన్యాసాలు చూడొచ్చు.
Story first published: Wednesday, July 15, 2026, 20:34 [IST]