ఆడా, మొగా అని డౌట్ వచ్చేలా లారెన్స్
కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడుగా మారిన లారెన్స్ తాజా చిత్రం 'కాంచన'.ఈ చిత్రాన్ని అతను డైరక్ట్ చేస్తూ ఓ స్త్రీ గెటప్ లో కనిపించనున్నాడు..ఈ పాత్రని మొదట అనూష్క చేత చేయిందామనుకున్నాడు. కానీ ఆమె డేట్స్ ఇవ్వననటంతో ఆ పాత్రను తానే చెయ్యటానికి రెడీ అయ్యాడు. బెల్లంకొండ సురేష్ తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ...ఈ చిత్రంలో లారెన్స్ రెండు గెటప్స్‌లో కనిపిస్తాడు.వీటిలో ఒకటి స్ర్తీ గెటప్. క్లయిమాక్స్ ముందు లారెస్స్ ఈ స్ర్తీ వేషంలో కనిపిస్తాడు. ఈ గెటప్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లారెన్స్ మంచి కమర్షియల్ డెరైక్టర్. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ 'కాంచన" మరో 'అపరిచితుడు" అవుతుంది. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక లారెన్స్ తెలుగులో 'రెబల్' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ హీరో కాగా; అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్లు.


Click it and Unblock the Notifications











