లారెన్స్ ‘రెబల్’ తర్వాత సినిమా ఖరారు
ప్రస్తుతం ప్రభాస్ తో రెబెల్ చిత్రం చేస్తున్న లారెన్స్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ చిత్రం ముని పార్ట్ 3 అని చెప్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ముని చిత్రం విజయం సాందించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన కాంచన సూపర్ హిట్టైంది. దాంతో ఇప్పుడు మూడో చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఏప్రియల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరోగా లారెన్స్ సోదరుడు హీరోగా చెయ్యనున్నాడు. ఈ చిత్రం డాన్స్ బేస్ డ్ గా నడవనుందని చెప్తున్నారు. సినిమాలో వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ లు స్పెషల్ గా ఉంటాయని చెప్తున్నారు.
ఇక రెబెల్ విషయానికి వస్తే... దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. 'రెబల్' అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది అన్నారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -''డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే 'రెబల్' హై బడ్జెట్ ఫిలిం అవుతుంది'' అని చెప్పారు.
'ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











