Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘లారెన్స్’ వీడి స్టైలే వేరు!
లారెన్స్ హీరోగా నటించిన కెవి ఆర్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై కోరుకొండ వరహాలరావు, కెవి ఆర్ ఫిలింస్ పతాకంపై శ్రీదేవి సమర్సణలో తెలుగులోకి లారెన్స్(వీడి స్టైలేవేరు) అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు ఓ చిత్రాన్ని అందిస్తున్నారు. ఘంటసాల రత్నకుమార్ రచన చేస్తున్నారు. నిర్మాత లారెన్స్ గురించి మాట్లాడుతూ తమిళంలో సూపర్ గుడ్ సంస్థ అందించిన ఈ చిత్రాన్ని లారెన్స్ పేరుతో అనువదించాం. హీరో ఇంటి పెద్ద కొడుకు. అయితే ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఓ సందర్భంలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె పెళ్లయ్యాక ఏం పెట్టి పోషిస్తావంటూ జ్ఝానోదయం చేస్తుంది. ప్రేమ కోసం లారెన్స్ కష్టపడి వెల్ కమ్ గ్రూప్ హోటల్స్ కు అధినేత అవుతాడు.
లక్ష్యం తర్వాత ఆమె ప్రేమను పొందుతాడా? లేదా? అనేది చిత్ర కథాంశం. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. లారెన్స్, స్నేహిత, నటరాజన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.