లేడీ గెటప్ చూసి షాకయ్యారు

By Srikanya

ట్రైలర్‌లో ఆ గెటప్ చూసి మా ఇంట్లోవాళ్లు కుష్‌బూనో, రాధిక లేదా భానుప్రియనో చేశారనుకున్నారు. తర్వాత నేను చేశానని తెలిసి షాకయ్యారు అని చెప్పారు రాఘవ లారెన్స్. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'కాంచన" ఈ నెల 15న విడుదల కానుంది. ఆ చిత్రం ఎందుకు చేసానో చెబుతూ...హాలీవుడ్ సినిమాలు, టీ వీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. వారిని థ్రిల్లింగ్‌కి గురి చేసే అంశం ఉంటేనే వస్తున్నారు. అందుకే 'కాంచన" చేశాను.

మునికి సీక్వెల్ ఇది. వినోదాత్మక హారర్ చిత్రమిది. ఇంతవరకు ఈ తరహా సినిమా రాలేదు. ఇందులో నేను లేడీ గెటప్ కూడా వేశాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. శివశంకర్ మాస్టారి దగ్గర స్త్రీ గెటప్ విషయంలో కొన్ని మెళకువలు తెలుసుకున్నా అన్నారు.బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత. ఇక లారెన్స్ తెలుగులో 'రెబల్' సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు . ఇందులో ప్రభాస్ హీరో కాగా; అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X