చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మంచు లక్ష్మీప్రసన్న

By Srikanya

చెన్నై : మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ నటించిన 'డబుల్స్' అనే చిత్రాన్ని తమిళంలో 'పుదువై మనగరమ్' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా 'గుండెల్లో గోదారి'లోని తాప్సీ ఫొటోలను వినియోగిస్తున్నారని, ఇది అభ్యంతరకరమని లక్ష్మీ చెబుతూ, ఈ విషయాన్ని తమిళనాడు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ సినిమా ప్రచారం కోసం 'గుండెల్లో గోదారి'లోని తాప్సి ఫొటోలను వాడుకుంటున్నారు. ''ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము'' అన్నారు లక్ష్మీ ప్రసన్న.

''గుండెల్లో గోదారి ఓ సాహసోపేతమైన ప్రేమకథ. వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకొన్నాము. 1980 కాలంలో నడిచే కథ ఇది. ఇళయరాజా ఆరు బాణీలను అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 'సినిమా విడుదలైన తరవాతే ఇవ్వు' అన్నారు. ఆ మాట ఎంతో సంతోషాన్నిచ్చింది' 'అని ఆమె చెప్పారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పాటల్ని, నవంబరు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తారు.

ఇక తన పాత్ర గురించి ఆది చెపుతూ...ఇందులో మత్యకారుని పాత్ర. పేరు మల్లిగాడు. ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడతాను. అందుకోసం షూటింగ్‌కు రెండు వారాల ముందే రాజమండ్రికి వెళ్లాను. అక్కడి మత్స్యకారులతో గడిపాను. వాళ్ల ఆహార్యం, భాష ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ప్రత్యేకంగా గోదావరి యాస నచ్చింది. రెండు వారాలు తక్కువ సమయమే. అయితే మా ఇంట్లోనూ కొంత వరకూ ఆ యాస ఉంటుంది. కాబట్టి ఇట్టే అలవాటుపడ్డాను. అక్కడ షూటింగ్‌ జరిగిన ప్రతి రోజు ఓ జ్ఞాపకమే. నీళ్లపై కంటే నీళ్ల లోపల చిత్రీకరణ ఎక్కువ రోజుల చేయడం వలన నాకు మలేరియా కూడా వచ్చింది. లక్ష్మీ ప్రసన్న, తాప్సి ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. 'ఒక విచిత్రం' తర్వాత తెలుగులో నేను నటిస్తున్న ఈ చిత్రం నా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది''అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ... ''నాకిది ప్రత్యేకమైన చిత్రం. ఇప్పటి వరకూ.. గ్లామర్‌ తరహా పాత్రల్లోనే చూశారు. ఈ సినిమా నాలోని విభిన్నమైన కోణాన్ని బయటపెడు తుంది. నా మొదటి చిత్రం 'ఝుమ్మంది నాదం' నాకు గ్లామరస్ ఆర్టిస్ట్ ఇమేజ్‌ను తెచ్చింది. ఈ చిత్రం ద్వారా అందుకు భిన్నమైన ఇమేజ్ వస్తుంది'' అని తాప్సి చెప్పింది. మంచు లక్ష్మీప్రసన్న నటిస్తూ నిర్మించిన చిత్రం 'గుండెల్లో గోదారి'. ఆది,తాప్సి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X