twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక హిట్టుకే భూమి మీద ఆగటం లేదు

    By Srikanya
    |

    కాంచనమాల కేబుల్ టీవి చిత్రంతో తెలుగులో పరిచయమైన లక్ష్మీరాయ్ ఆ తర్వాత పౌర్ణమి చిత్రంలో చేసినా హిట్టు కాలేదు..ఆఫర్సూ రాలేదు. అలాగని ఆమె బాలీవుడ్, కోలీవుడ్ లలో ఇరగతీస్తోందా అంటే అక్కడా ఆమెను పట్టించుకునేవారే కరవయ్యారు. ఈ నేఫద్యలో ఆమెకు మరో సారి సినీ జీవితాన్ని ప్రసాదించాడు లారెన్స్. ఆయన తన తాజా హిట్ కాంచనతో లక్ష్మీరాయ్ కొద్దో గొప్పో గుర్తింపు తెచ్చి పెట్టాడు. దాంతో ఆమె ఆనందానికి అంతు లేకుండా పోయింది. కాంచన సినిమా ప్రమోషన్ లో కలిసే మీడియాతో ఆమె కంటిన్యూగా బిల్డప్ లు ఇస్తోంది.

    అంతేగాక..'ఓ పాట పాడామా, ఓ ఆట ఆడామా...అన్నట్టుండే కథలు నేను ఒప్పుకోను. నేను వేసే రోల్‌ తప్పకుండా కథలో భాగమవ్వాలి. ప్రాధాన్యత కలిగి ఉండాలి. అలా లేకపోతే...లక్ష్మీరాయ్ చేసింది కదా అన్న పేరు ఎలా వస్తుంది. ప్రత్యేకతే లేకపోతే ప్రేక్షకులు హర్షించరు' అని అంటోంది ఈ కన్నడ భామ లక్ష్మీరాయ్. దాంతో ఈ మాటలు విన్నవారంతా ఒక్క హిట్టు వచ్చేసరికి ఎన్ని కబుర్లు చెప్తోంది అని నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్ బాలకృష్ణ చిత్రంలో చేస్తోంది.

    English summary
    Raghava Lawrence’s Kanchana has turned out to be a huge hit at box office. The film opened with houseful collections at several centers across the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X