దివంగత ఎంజీఆర్ లైవ్‌గా మళ్లీ దర్శనం.. అద్భుతమైన టెక్నాలజీతో

తమిళనాడు నట, రాజకీయ దిగ్గజం దివంగత యంజీఆర్ అభిమానులకు శుభవార్త. ఎంజీఆర్ మళ్లీ తెరపైన దర్శనమివ్వడానికి సిద్ధమయ్యారు. మరణించిన మహానేత ఎలా తెర మీద కనిపించనున్నారా అని ఆశ్చర్య పోతున్నారా? ఎంజీఆర్ 3డీ సినిమాను మలేషియాకు చెందిన యానిమేషన్ కంపెనీ ఆరెంజ్ కౌంటీ రూపొందించింది.

ఎంజీఆర్ చిత్రాన్ని ఎన్ ఫేస్ అనే సరికొత్త యానిమేషన్ టెక్నాలజీతో తెరకెక్కించినట్టు ఇండివుడ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ టెక్నాలజీ వల్ల ఎంజీఆర్ వాస్తవంగా ఉన్నట్టే భ్రమ కలుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

Legend MGR to come alive through Indywood

హలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్పెషలిస్టులతో కలిసి ఆరంజ్ కౌంటీ రెండేళ్ల పాటు శ్రమించి ఎంజీఆర్ సినిమాను రూపొందించింది. మహానటుడి హావభావాలు, రూపాన్ని చక్కగా తెరకెక్కించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించారు.

డిసెంబర్ తొలివారంలో జరిగే ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్‌లో ఈ టెక్నాలజీని భారతీయ సినిమా పరిశ్రమకు మలేషియా కంపెనీ పరిచయం చేయనున్నది. ఈ చిత్రోత్సవం భారీ స్థాయిలో హైదరబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X