హీరోగా ఎంట్రీ ఇస్తున్న లెజెండ్ శరవణ స్టోర్స్ ఓనర్!

'ది లజెండ్ శరవణ స్టోర్స్' పేరుతో ఆభరణాలు, దుస్తువుల షోరూం నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యాపారి శరవణన్ ఇటీవల తన షాపు ప్రచారం కోసం... తనే రంగంలోకి దిగారు. తమన్నా, హన్సికతో కలిసి యాడ్ ఫిల్మ్‌లో నటించి వార్తల్లోకి ఎక్కారు. అయితే శరవణన్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

తమన్నా, హన్సికతో కలిసి అతడు చేసిన యాడ్ ఫిల్మ్స్... సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరో పర్సనాలిటీ లేక పోయినా స్టార్ హీరోయిన్లతో యాడ్స్ చేసిన శరవణన్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా త్వరలో ఏకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు.

Legend Saravana Stores owner debut in to Films

తాజాగా సమాచారం ప్రకారం... దర్శక ద్వయం జేడీ, జెర్రీ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాట. తమిళ సినీ పరిశ్రమలోని పలువురు టాప్ టెక్నీషియన్లను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడి సరసన నటించేందుకు ఓ టాప్ హీరోయిన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

ది లెజెండ్ శరవణ స్టోర్స్ వ్యాపారాన్ని భారీగా విస్తరించిన శరవణన్... ఆ సంస్థ ప్రచారం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇపుడు హీరో అవతారం ఎత్తేది కూడా తన వ్యపారానికి మరింత ప్రచారం కల్పించడానికే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. శరవణన్ సినీ రంగ ప్రవేశం తమిళనాడులో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X