తమిళ రాజకీయాల్లోకి లెజెండ్ యాక్టర్.. విజయ్‌కు పోటీగా రంగంలోకి!
తమిళ సినీ రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎంజీఆర్ నుంచి ఇప్పటి ఇళయదళపతి విజయ్ వరకు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. తమిళ పాలిటిక్స్‌లో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, కమల్ హాసన్ వరకు తమ ముద్రను చూపించారు. అయితే సినీ రంగాన్ని వదిలి విజయ్ తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా మరో యాక్టర్ కూడా తాను ప్రజా సేవలోకి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ హీరో ఎవరంటే?
తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారల హడావిడి ఎక్కువగా కనిపించబోతున్నది. విజయ్ ఇప్పటికే పార్టీ పెట్టి తన కార్యాచరణను ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే ది గోట్ సినిమాతో అభిమానుల్లో హంగామా క్రియేట్ చేశారు. తన చివరి సినిమాను కూడా అధికారికంగా ప్రకటించి.. తన సినీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రజా జీవితంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఇక విజయ్ తర్వాత తమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్టు లెజెండ్ సినిమా హీరో అరుల్ శరవణన్ ప్రకటించారు. తమిళనాడులో అతి పెద్ద వ్యాపార సంస్థ అధినేతగా కొనసాగుతున్నారు. ఆయన తమిళ రాజకీయాల్లో వస్తున్నట్టు.. త్వరలోనే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
తమిళనాడులో శరవణన్ అరుల్‌ను లెజెండ్ శరవణన్ అని కూడా ముద్దుగా పిలుస్తారు. చెన్నైలో జన్మించిన ఆయన నిర్మాతగా, పారిశ్రామికవేత్త, నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. 52 ఏళ్ల వయసులో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపారు. మరో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

అరుల్ శరవణన్ తండ్రి యోగారత్నం. సౌతిండియాలో సూపర్ శరవణన్ స్టోర్స్, శరవణ స్టోర్స్ క్రౌన్ మాల్ అనే చైన్ సంస్థలను నిర్వహిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని స్వీకరించి వ్యాపార రంగంలో తనదైన ప్రతిభను చాటుకొని మరింతగా బిజినెస్‌ను విస్తరించారు.
అరుల్ శరవణన్ కేవలం పారిశ్రామిక, సినీ రంగానికే పరిమితం కాలేదు. సమాజ సేవలో కూడా ముందున్నారు. కోట్లాది రూపాయలను ప్రతీ ఏటా సోషల్ సర్వీస్‌కు వెచ్చిస్తున్నారు. ఇక ముందు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలా తనదైన శైలిలో రాణిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications