Just In
- 8 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 3 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ నటి మనోరమ మృతి
చెన్నై: సీనియర్ నటి మనోరమ (78) చెన్నైలో శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళం ఇతర భాషల్లో వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు.

1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆచ్చిగా (బామ్మగా) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోరమ సినీరంగంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె పని చేశారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె తొలుత రంగస్థల నటిగా గుర్తింపు పొందారు. తర్వాత సినీరంగంలోకి వచ్చారు. 1937, మే 26న తమిళనాడులోని ఆమె తంజావూరులోని మన్నార్గుడిలో జన్మించారు జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.
1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: శుభోదయం,జెంటిల్ మేన్ ,రిక్షావోడు,పంజరం ,బావనచ్చాడు ,మనసున్నమారాజు ,అరుంధతి ,నీప్రేమకై ,కృష్ణార్జున.

మనోరమ భౌతికకాయాన్ని టినగర్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేటి సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మనోరమ మృతికి వన్ ఇండియా తెలుగు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తోంది.