నటి మనోరమ...జీవిత విశేషాలు

By Srikanya

చెన్నై: సీనియర్‌ నటి మనోరమ (78) చెన్నైలో శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళం ఇతర భాషల్లో వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు.

ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలు. 1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత.

12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన మళ ఇట్ట మంగై సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు మనోరమ.

Legendary Tamil Actress Manorama 'Aachi' Passes Away

తొలి సినిమాలోనే కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత ఎక్కువగా ఆ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్ గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ ఇండస్ట్రీ ని ఏలారు.

1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆచ్చిగా (బామ్మగా) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోరమ సినీరంగంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎంజీఆర్‌, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె పని చేశారు.

పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె తొలుత రంగస్థల నటిగా గుర్తింపు పొందారు. తర్వాత సినీరంగంలోకి వచ్చారు. 1937, మే 26న తమిళనాడులోని ఆమె తంజావూరులోని మన్నార్గుడిలో జన్మించారు జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.

Legendary Tamil Actress Manorama 'Aachi' Passes Away

1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: శుభోదయం,జెంటిల్ మేన్ ,రిక్షావోడు,పంజరం ,బావనచ్చాడు ,మనసున్నమారాజు ,అరుంధతి ,నీప్రేమకై ,కృష్ణార్జున.

మనోరమ భౌతికకాయాన్ని టినగర్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేటి సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మనోరమ మృతికి వన్ ఇండియా తెలుగు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X