లైంగికంగా వేధించాడు.. శింబును టార్గెట్ చేసిన హీరోయిన్!

Recommended Video

#Metoo : Actress Lekha Washington Comments On Simbu

తమిళ చిత్ర పరిశ్రమలో జోరు మీద ఉన్న అందాల భామ లేఖా వాషింగ్టన్ మీ టూ అంటూ సంచలనం రేపింది. తనతో ఓ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది. దాంతో ఒక్కసారిగా తమిళ సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు శింబును ఉద్దేశించినవే అనే మాట వినిపిస్తున్నది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో లేఖా వాషింగ్టన్ వదిలేస్తుందా లేక మరింత సాగదీస్తుందా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

లేఖా వాషింగ్టన్ లైంగిక ఆరోపణలు

లేఖా వాషింగ్టన్ లైంగిక ఆరోపణలు

తమిళ సినీ పరిశ్రమను మీ టూ ఉద్యమం అతలాకుతలం చేస్తుంటే మళ్లీ లేఖా వాషింగ్టన్ వ్యాఖ్యలు చేయడం సంచలన రేపుతున్నది. ఒక్క మాట. కెట్టావన్. మీ టూ అంటూ లేఖ ఓ హింట్‌ను అందించింది. గతంలో శింబు, లేఖా వాషింగ్టన్ కలిసి కెట్టావన్ అనే చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

తెరపైకి కెట్టావన్ సినిమా పేరు

తెరపైకి కెట్టావన్ సినిమా పేరు

కెట్టావన్ చిత్రం విడుదలకు కారణం నటుడు శింబు అని చెప్పుకొంటారు. డైరెక్టర్‌ నందూ, శింబు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో కెట్టావన్ చిత్రం ఆగిపోయింది. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్‌లో ఒకటి తాజాగా వైరల్ అయింది.

లేఖాపై శింబు ఫ్యాన్స్ ఫైర్

లేఖాపై శింబు ఫ్యాన్స్ ఫైర్

శింబును టార్గెట్ చేస్తూ లేఖా వాషింగ్టన్ చేసిన ట్వీట్‌ వివాదంగా మారుతున్నది. తన హీరో ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ లేఖపై శింబు ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. లేఖపై దారుణమైన కామెంట్లతో దాడి చేస్తున్నారు. దానిని ఉద్దేశించి మహిళలు కొన్ని సందర్భాల్లో ఎందుకు బయటకు రారో అర్ధమవుతున్నది అని మరో ట్వీట్ చేసింది.

తమిళ పరిశ్రమలో మరో రచ్చ

తమిళ పరిశ్రమలో మరో రచ్చ

వైరముత్తు, అర్జున్, సుశీ గణేషన్, రాధారవి లాంటి నటులపై లైంగిక ఆరోపణలు రావడం తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నది. దక్షిణాదిలో కూడా మీ టూ ఉద్యమం బలపడుతున్నదా అనే అనుమానం కూడా మొదలైంది. ఇదే కొనసాగితే మరికొంత మంది మహిళా సెలబ్రిటీలు నోరు విప్పే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X