LEO Censor Review విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. 34 కట్స్‌.. డైలాగ్స్‌పై అభ్యంతరాలు!

తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లియో (Leo). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో మూడో చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే..

విజయ్, త్రిష జంటగా నటించిన లియో (Leo) చిత్రాన్ని సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వీర లెవెల్లో జరుగుతున్నది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు, బజ్, క్రేజ్ క్రియేట్ అవుతున్నది. అయితే తమిళంలో దసరా పండుగ రేసులో భారీ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా లియో (Leo)ను ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.

Leo Censor Review: Vijay and Lokesh Kanagarajs movie gets 34 Cuts from Censor Board

తమిళనాడులో లియో (Leo) మూవీ ప్రత్యేక పరిస్థితుల మధ్య రిలీజ్ అవుతున్నది. విజయ్ రాజకీయ ఎంట్రీకి జరుగుతుందని ప్రచారం మధ్య ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే లియో ట్రైలర్‌ పెద్దగా ఆకట్టుకోకపోవడం అభిమానులను నిరాశ గురిచేసింది. అంతేకాకుండా భారీగా విజయ్‌ని, లోకేష్‌ను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో జరిగిన సినిమా సెన్సార్ కూడా చర్చనీయాంశమైంది.

లియో (Leo) చిత్రంలోని పలు సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అధికారులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. పలు సీన్లను తొలగించాలని, పలు డైలాగ్స్‌కు బీప్ వేయాలని సూచించారు. దాదాపు ఈ సినిమాలో 34 సీన్లపై అభ్యంతరం చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ నటించిన సినిమాకు ఇటీవల కాలంలో ఇలాంటి అభ్యంతరాలు లేకపోవడం గమనార్హం. రాజకీయాల్లోకి వస్తున్నారనే కారణంతోనే ఇలాంటి అభ్యంతరాలు పెట్టారా అనే చర్చ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

Vijay Lokesh Kanagaraj Leo Censor Report

లియో (Leo) సినిమాలో కనిపించే సన్నివేశాలకు సంబంధించిన ప్రాంతాల పేర్లను అన్నీ భాషల్లో స్పష్టంగా కనిపించేలా చూపించాలి అనే కండిషన్ పెట్టారు. మాదర్ ఛోద్, ఫక్, ఫకింగ్ లాంటి పదాలను తొలగించాలని లేదా మ్యూట్ చేయాలని చెప్పారు. కలెక్టర్ హత్యకు సంబంధించిన తీవ్రతను తగ్గించాలి. రక్తపాతంలా కనిపించిన ఫైట్స్‌లో తీవ్రతను తగ్గించాలి అంటూ దాదాపు 13 పాయింట్లను సెన్సార్ సర్టిఫికెట్‌లో ఉంచారు.

లియో (Leo) మూవీలో మొత్తంగా 43 సెకన్ల నిడివి ఉన్న సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా నిడివి 164.27 నిమిషాలు. అంటే దాదాపు 2 గంటల 44 నిమిషాలకుపైగా నిడివి ఉంటుంది. ఇలాంటి అభ్యంతరాల మధ్య విజయ్ నటించిన లియో చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. అభిమానులను ఈ సినిమా ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X