twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడి ఇంటిముందే నేను ఆత్మహత్య చేసుకుంటా : ఏం జరిగింది?

    దర్శకుడు మణిరత్నం ఇంటిముందే నేను ఆత్మహత్య చేసుకుంటా ఆయన నన్ను మోసం చేసారు అంటూ మణిమారణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనంగా మారాయి. ఎవరీ మణి మారన్ ఇండియన్ టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకడైన మణి

    |

    దర్శకుడు మణిరత్నం ఇంటిముందే నేను ఆత్మహత్య చేసుకుంటా ఆయన నన్ను మోసం చేసారు అంటూ మణిమారణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనంగా మారాయి. తనకు కానీ మణిరత్నం న్యాయం చేయకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడతను.

     మణి రత్నం చేసిన ద్రోహం ఏమిటీ

    మణి రత్నం చేసిన ద్రోహం ఏమిటీ

    ఇంతకీ ఈ ఎవరీ మణి మారన్ ఇండియన్ టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకడైన మణి రత్నం ఇతనికి చేసిన ద్రోహం ఏమిటీ ? అందులోనూ ఇతను సినిమా బయ్యర్ కాదు, ఏ సినిమానూ కొని నష్టపోలేదు, కడలి సినిమా అట్తర్ ఫ్లాప్ అయినప్పుడు కూదా బయ్యర్లనుంచి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ నే ఎదుర్కొన్న మణిరత్నం ఈ సారి మరో రకం చిక్కుల్లో ఇరుక్కునాడు... ఇంతకీ ఈ మణి వర్సెస్ మణి వ్యవహారం ఏమిటంటే....

    అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యలతో

    అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యలతో

    గతంలో మణిరత్నం అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యలతో కలిసి గురు అనే మూవీని చేయటం తెలిసిందే కదా. మణికి చక్కటి బ్యాండ్ వేసిన సినిమాల్లో ఇదీ ఒకటి తర్వాత అదే కాంబినేషన్ లో తీసిన విలన్ కూడా సేమ్ రెజల్ట్ రిపీట్ చేసిందనుకోండి అది వేరే విషయం.

    తెలుగులో గురుకాంత్

    తెలుగులో గురుకాంత్

    అయితే ఈ మణి మారన్ విషయం వేరు గురు (తెలుగులో గురుకాంత్) సినిమాకు లైట్ మ్యాన్ గా మణిమారన్ పని చేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మణిమారన్ రక్తసంబంధ వ్యాధికి గురయ్యాడు. అయితే తన వైద్య ఖర్చులకు లైట్‌ మ్యాన్‌ సంఘం, మణిరత్నం, 'గురు' చిత్ర యూనిట్‌ ఎలాంటి సహాయం చేయలేదని,

    20వేలు లంచం అడిగారని

    20వేలు లంచం అడిగారని

    పదేళ్లుగా తన కుటుంబ సభ్యులే తన వైద్య ఖర్చులు భరిస్తున్నారని, తనకు రావాల్సిన డబ్బు ఇప్పించలేకపోతే మణిరత్నం నివాసం ముందే ఆత్మహత్యకు పాల్పడతానని ఆయన హెచ్చరించాడు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించగా తనకే అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయితే తనకు రావాల్సిన రూ.2లక్షలు ఇచ్చేందుకు లైట్‌మన్ సంఘం కార్యదర్శి రామన్ రూ.20వేలు లంచం అడిగారని ఆరోపించారు.

    మణిరత్నం ఇంటి ముందు

    మణిరత్నం ఇంటి ముందు

    పదేళ్లుగా తనను కుటుంబమే పోషిస్తోందనీ, ఇప్పటికీ తనకు రావాల్సిన డబ్బు చెల్లించకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా, మణిమారన్ ఆరోపణలను మణిరత్నం సన్నిహితులు ఖండించారు. చాలా కాలంగా అతడు తమను వేధిస్తున్నాడని, అతడి ఆరోగ్య సమస్యకు ప్రొడక్షన్ కంపెనీ ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు.

    కేవలం రెండు లక్షలు

    కేవలం రెండు లక్షలు

    మణిమారన్ అనవసరంగా మణిరత్నంను వివాదంలో లాగుతున్నారని వారు వ్యాఖ్యానించారు. అయితే కేవలం రెండు లక్షలు అటు మణిరత్నం కి గానీ ఇటు లైట్ మాన్ సంఘానికి గానీ పెద్ద లెక్క పెట్టదగ్గ అమౌంట్ కాదు, మరి ఈ సంఘటన మీద మణిరత్నం ఎలా రియాక్టవుతాడన్నది చూడాలి...

    English summary
    The Lightmen Union on Tuesday slammed one of their own, Manimaran, for his allegation of noncompensation of medical expenses by veteran filmmamker Mani Ratnam as unfair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X