బిర్యాని బ్యాచ్ లోకి ధనుష్ కూడా
చెన్నై: తమ సినిమా షూటింగ్ ఆఖరి రోజు చిత్ర యూనిట్ కు సొంత ఖర్చుతో బిర్యానీ విందు ఏర్పాటు చేయడం తమిళ హీరోలు అజిత్, విజయ్‌కు అలవాటు. పండుగ రోజుల్లో కూడా చిత్ర బృందానికి ఇలాంటి విందునే ఆ హీరోలు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో ధనుష్ కూడా చేరారు.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'మారి'లో ధనుష్ నటిస్తున్నారు. ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ ఆడిపాడుతోంది. శరవేగంగా జరిగిన చిత్రీకరణ శరవేగంగా జరిగి ఇటీవలే ముగిసింది. బృందానికి ధనుష్ బిర్యానీ విందు ఏర్పాటు చేయడంతోపాటు స్వయంగా వడ్డించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మారి ఓ తమిళ కామెడీ చిత్రం. ఇందులో ధనుష్ సరసన కాజల్ అగర్వాల్ చేస్తోంది. విజయ్ యేసుదాస్, రోబో శంకర్, కాళి వెంకట్ ఈ చిత్రంలో మిగతా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంకోసం చెన్నై పరిసరప్రాంతాల్లో స్లమ్ లో ఉండే హౌస్ సెట్ వేసారు. అక్కడే షూటింగ్ ఎక్కువ భాగం చేసారు. నార్త్ మద్రాస్ లో ఉంటే టైలర్ పాత్రలో ధనుష్ కనిపించనున్నారు. లోకల్ స్లమ్ లో ఓ లీడర్ గా ఉంటూంటాడు. అందుకే ప్రత్యేకంగా మద్రాస్ బాషను మాట్లాడుతాడు

అలాగే ఈ చిత్రంలో ధనుష్...కోర మీసాలు, పిల్లి గడ్డం పెంచి కొత్తగా కనిపించనున్నారు. వేల్లై ఇలా పట్టదారి చిత్రం తర్వాత ధనుష్ తన హుండర్ బార్ ఫిల్మ్స్ ప్రెవేట్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ఇది.
తెలుగులోనూ..
తమిళ హీరో ధనుష్ తన డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో చాలా కాలం నుంచి దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఆపు, అంతులేకుండా సాగుతున్న ఈ పోరాటం అతనికి ప్రతీ సారి అతనికి పరాజయాన్నే మిగిలిస్తోంది. అయితే తాజాగా తెలుగులో ఆయన ఫేట్ మారింది. ఆయన చిత్రం తొలి సారి 50 రోజులు పడింది. వైజాగ్ లో ఆయన తాజా చిత్రం రఘువరన్ బిటెక్ 50 రోజులు ఓ థియోటర్ లో ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మారి చిత్రం సైతం ఇక్కడ డబ్బింగ్ అయ్యి విడుదల కానుంది.
హిట్టైన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ గా రావటం కొత్తేమీ కాదు. తాజాగా మరో చిత్రం అలా డబ్బింగ్ అయ్యి తెలుగులోకి వచ్చింది. అయితే ఎవరో ఊరూ పేరు లేని బ్యానర్ కాకుండా...తెలుగులో పెద్ద పేరున్న,సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం విడుదల అవుతూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడి ఓపినింగ్స్ వచ్చాయి. దానికి తోడు తమిళంలోనూ ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వీఐపీ' తెలుగులో ‘రఘువరన్ బీటెక్'గా విడుదల అయ్యి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











