ఆడియో తేదీ ఖరారు..ఫ్యాన్స్ పండుగ

By Srikanya

చెన్నై : తమ అభిమాన హీరో చిత్రం విడుదల అవుతోందన్నా లేదా ఆడియో విడుదల అవుతోందన్నా అభిమానుల ఆనందం ఓ రేంజిలో ఉంటుంది. అందులో రజనీ లాంటి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అయితే మరీను. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఆడియో విడుదల తేదీని ఖరారు చేసారు.

నవంబర్ 16 న చెన్నైలో ఈ వేడుక ఘనంగా జరగనుందని సమాచారం. తెలుగు,తమిళ,హింది ఆడియోని అదే రోజు విడుదల చేస్తారు. దాంతో అభిమానులంతా ఈ విషయన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఆనందంగా షేర్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఆడియో సేల్స్ విషయంలోనూ ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుందని, చేసేలా చేస్తామని అభిమానులు అంటున్నారు. వారి అంచనాలకు తగినట్లే ...ఈ చిత్రం బిజినెస్ సైతం ఊహించని స్ధాయిలో జరిగింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ పంపిణీ హక్కుల్ని ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 165 కోట్లకు సొంతం చేసుకుంది.

Linga audio launch confirm

చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. మూడు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా రజనీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది అన్నారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు.

ఇంత భారీ మొత్తంలో పంపిణీ హక్కులు అమ్ముడుపోయిన తొలి భారతీయ చిత్రంగా లింగా రికార్డుల్లోకెక్కడం విశేషం. ఇరోస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రహమాన్, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: సంజిత్ ఎంహెచ్‌డి. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X