రజనీకాంత్ చేసిన పని నాకు నచ్చలేదు.. ఆయన వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది: డైరెక్టర్ కామెంట్స్
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో తన మార్కెట్ లో పట్టును కోల్పోతున్న విషయం తెలిసిందే. గతంలో తెలుగు తమిళ్లో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆయన మళ్ళీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలి అని చూస్తున్నాడు. ఇక ఈ తరుణంలో ఒక సీనియర్ దర్శకుడు రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన మధ్యలో వేలు పెట్టడం మూలంగానే ఒక భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయిందని వివరణ ఇవ్వడం విశేషం. ఇక ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏది అనే వివరాల్లోకి వెళితే..

అప్పట్లో అలాంటి మార్కెట్
సూపర్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు ఈజీగా పెట్టిన పెట్టుబడి వచ్చేది అని నిర్మాతలు చాలా నమ్మకంతో ఉండేవారు. ముఖ్యంగా తెలుగులో కూడా ఆయన భారీ స్థాయిలో స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకున్నారు. కానీ శివాజీ, రోబో లాంటి సినిమాల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేక పోయారు.

బాక్సాఫీస్ హిట్స్
ఇక రీసెంట్ గా సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వీరి కలయికలో వచ్చిన నరసింహ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందే వీరి కలయికలో వచ్చిన ముత్తు సినిమా కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంది.

రజనీకాంత్ కారణంగా
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ దర్శకుడు రజనీకాంత్ చేసిన ఒక భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం కూడా ఆయనే అని చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది. షూటింగ్ మధ్యలో ఆయన ఒక సన్నివేశాన్ని మార్చాలని చెప్పడం, క్లయిమ్యాక్స్ లో అనవసరంగా ఉన్న సీన్ ను ఏమాత్రం తొలగించవద్దు అని చెప్పగానే సినిమా రూపురేఖలు మారిపోయాయని సినిమా ఫ్లాప్ అవ్వడానికి అది కూడా ఒక కారణం అని అన్నారు.

దర్శకుడు అప్సెట్
కేసు రవికుమార్ రజనీకాంత్ కలయిక లో వచ్చిన మూడవ సినిమా లింగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో రవికుమార్ షూటింగ్ మధ్యలోనే కాస్త సంతృప్తితో బయటకు రావాలని అనుకున్నట్లు అప్పట్లో చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ సూపర్ స్టార్ మీద గౌరవంతో రవికుమార్ ఆ సినిమాను పూర్తి చేసే వరకు ఓర్పుతోనే కొనసాగారట.

ఆ సీన్ కారణంగా..
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగా సినిమా విషయంలో జరిగిన ఒక పొరపాటు గురించి తెలియజేశారు. అసలైతే మొదట అనుకున్న క్లైమాక్స్ ఆ తర్వాత సినిమాలో వచ్చిన క్లైమాక్స్ ఒకటి కాదట. అసలు బెలూన్ తరహా యాక్షన్ ఎపిసోడ్ లింగాకు లేదు అని యంగ్ రజినీకాంత్ అసలు హీరో అని సినిమా అతని యాక్షన్ ఎపిసోడ్ తో పూర్తి చేయాలని అనుకున్నారట.
అయితే సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ చివరి దశలో ఉండగా రజనీకాంత్ వచ్చి లింగా లాస్ట్ ఎపిసోడ్ ఎడిటింగ్ లో తీసేస్తూ ఉండగా ఆయన వద్దని వాదించి ఉంచారు. అది సినిమా చూసిన తర్వాత చాలా మైనస్ గా అనిపించింది అని కెఎస్. రవికుమార్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











