దీపావళి కానుకగా ...రజనీ గిప్ట్

By Srikanya

చెన్నై : రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లింగా'. ఇందులో సూపర్‌స్టార్‌ రజినికాంత్‌ హీరోగా నటిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతు న్నారు. ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 23న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలన్నీ తెరకెక్కించారు. ఇటీవల క్లెమాక్స్‌ సన్నివేశాలను కర్ణాటకలో తెరకెక్కించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వినాయకచవితి సందర్భంగా 14 సెకన్ల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ నడిచిస్తున్నట్టుగా ఉన్న ఫొటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. రజినీ ఇందులో మరింత స్టెల్‌గా కనిపిస్తున్నారన్నది ఆయన అభిమానుల మాట.

Lingaa audio to release on October 23rd

ఇదిలా ఉండగా పాటల చిత్రీకణ కోసం చిత్ర యూనిట్‌ త్వరలో ఐరోపా వెళ్లనుంది. అక్కడ మొత్తం రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఒకటి అనుష్క, రజినీకాంత్‌ కలయికలో కాగా.. మరోటి రజిని- సోనాక్షి జంటగా. ఇందుకోసం రజినీకాంత్‌, అనుష్క, సోనాక్షి, కేఎస్‌ రవికుమార్‌, కెమెరామెన్‌ రత్నవేల్‌ (రాండి) తదితర చిత్ర యూనిట్‌ ఐరోపా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా పాటలను రజినీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కొన్నిటిని ఈ సినిమాలో చర్చించే అవకాసం ఉందని అంటున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలి అనే అంశంతో కథనం నడుస్తుందని అంటున్నారు. 'లింగా' అనేది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర పేరు అని, అలాగే ప్రారంభం నుంచి యువకుడైన రజనీ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. విలన్ గా జగపతిబాబు పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కీలకమై నిలుస్తుందని చెప్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. రజనీకాంత్‌ మనవడు (ధనుష్‌- ఐశ్వర్య కుమారుడు) పేరు కూడా లింగా కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X