రజనీకాంత్ వల్ల మోసపోయాం...కాల్షీట్స్ ఇవ్వాలి
చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ తరఫు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని 'లింగా' చలనచిత్ర పంపిణీదారులు ఒక ప్రకటనలో ఆరోపించారు. తమ నష్టాన్ని భర్తీ చేసేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ...వేందర్ మూవీస్ చిత్రానికి కాల్‌షీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ గతంలో డిమాండ్ చేయగా నిర్మాతల సంఘం, దక్షిణ భారత నటుల సంఘం కలిసి ప్రత్యేకించి సమావేశమైనట్లు తెలిపారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తమకు ఏర్పడ్డ నష్టం రూ.33.50 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని కోరగా అందులో రూ.12.50 కోట్ల మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తామంటూ నిర్ణయించినట్లు తెలిపారు. ఆ నిర్ణయాన్ని తామూ అంగీకరించినట్లు గుర్తుచేశారు. ఆ నిర్ణయం మేరకు రూ.5.89 కోట్ల మొత్తాన్ని మాత్రం చెల్లించినట్లు తెలిపారు.

మిగిలిన రూ.6.61 కోట్ల మొత్తాన్ని ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయమై రజనీకాంత్ తరఫున వ్యవహరించిన తిరుప్పూరు సుబ్రమణియంను నిలదీయగా అతని నుంచి ఇప్పటివరకు సమాధానమేదీ అందలేదన్నారు. దీంతో తాము మోసపోయినట్లు తెలిపారు.
ఈ పరిస్థితుల్లో గతంలో తిరుప్పూరు సుబ్రమణియన్ ప్రకటించిన విధంగా వేందర్ మూవీస్ నిర్మించనున్న చిత్రంలో నటించేందుకు రజనీకాంత్ కాల్‌షీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తద్వారా లభించే మొత్తంతో తమ నష్టాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











