నష్టాలు: స్ట్రైక్ చేయబోతున్న ‘లింగా’ డిస్ట్రిబ్యూటర్లు?

By Bojja Kumar

చెన్నై: రజనీకాంత్ హీరాగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ‘లింగా' చిత్రం డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రంపై భారీ అంచనాలతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేసారు. అయితే సినిమా సరిగా ఆడక పోవడంతో నష్టాల పాలయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను రజనీకాంత్ ఆదుకున్నారు. ఈనేపథ్యంలో లింగా మూలంగా నష్టాల పాలైన తమను కూడా ఆదుకోవాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రజనీకాంత్ నుండి కానీ, నిర్మాత నుండి కానీ ఎలాంటి స్పందన లేక పోవడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు జనవరి 10న చెన్నైలోని వల్లూరు కొట్టం వద్ద స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Lingaa Distributors Hunger Strike From Jan 10?

లింగా సినిమాపై పెట్టుబడిన పెట్టి డిస్టిబ్యూటర్లు....60 శాతం నష్టపోయారు. ఆ మధ్య అంతా కలిసి రజనీకాంత్ ను అందరూ కలిసారు. క్రిస్ మస్, న్యూ ఇయర్ సందర్భంగా కలెక్షన్లు పెరుగుతాయి అని ఎదరు చూసారు. అయితే ఆశించిన కలెక్షన్లు రాలేదు. దీంతో తమను నష్టాల నుండి గట్టెక్కించాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.

న్యాయంగా అయితే డిస్ట్రిబ్యూటర్లు ఇలా చేయడంతగదు అనేది మరికొందరి వాదన. సినిమా వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. లాభాలు వస్తే అనుభవించే డిస్ట్రిబ్యూటర్లు.....నష్టాలు వస్తే మాత్రం తిరిగి డబ్బులు ఇవ్వమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసింది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి.

రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X