రజనీకాంత్ ‘లింగా’ న్యూ పోస్టర్ (ఫోటో)
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరో హరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో రజనీకాంత్ సంతానంతో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో రజనీకాంత్ ను ఎంత స్టైలిష్‌గా చూపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. పోస్టర్ రిలీజ్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ప్రి రిలీజ్ బజ్
రజనీకాంత్ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనిపించనున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్ లుక్‌లో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.


Click it and Unblock the Notifications











