అమెరికాలో రజనీకాంత్ ‘లింగా’ రికార్డ్ర్ రిలీజ్
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఫోటోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. విడుదల ముందే బిజినెస్ భారీగా జరుగుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ అరుణ్ పాండ్యన్‌కు చెందిన ఎ అండ్ పి గ్రూపు, సంజయ్ వధ్వాకు చెందిన ఎపి ఇంటర్నేషనల్ సంస్థలు దక్కించుకున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అమెరికాలో 200లకు పైగా స్క్రీన్లలో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ఏలో లీడింగ్ సంస్థ అయిన క్లాసిక్ ఎంటర్టెన్మెంట్స్ వారు దీన్ని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అరుణ్ పాండ్యన్‌కు, ఆ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

క్లాసిక్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ వారు ఈ చిత్రాన్ని అత్యంత నాణ్యతతో కూడిన బిగ్ డి, ఎక్స్ డి, ఎక్స్ ఎల్, డాల్బీ అట్మాస్ ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ లొకేషన్స్ డిటేల్స్ వెల్లడి కానున్నాయి. ఆ వెంటనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతాయి.
ఇటీవలే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 165 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది.
రజనీ-రవికుమార్ కాంబినేషన్ కూడా ఇంత క్రేజ్ పెరగడానికి మరో కారణం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే. మరి ఇపుడు ‘లింగా' చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications











