లేడి సూపర్ స్టార్ నయనతారకు క్రేజీ ఆఫర్.. ఇది నాలుగోది!
Recommended Video

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు నయనతార బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది. అటు గ్లామర్ పాత్రల్లో సైతం మెప్పిస్తోంది. సౌత్ లో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందించేందుకు కోలీవుడ్ లో పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జయలలిత బయోపిక్ పేరుతో మూడు ప్రాజెక్ట్స్ ప్రకటన జరిగింది.

పందెం కోడి డైరెక్టర్
తాజాగా జయలలిత బయోపిక్ కి సంబంధించి మరో ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. పందెం కోడి చిత్ర దర్శకుడు లింగుస్వామి జయలలిత బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జయలలిత జీవితం మొత్తం పోరాటాలతో కూడుకున్నది. అందుకే ఆమె జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అమ్మ పాత్రలో లేడి సూపర్ స్టార్
లింగుస్వామి జయలలిత పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతార పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రజలు అమ్మగా భావించే జయలలిత పాత్రలో నయనతార నటించబోతుందని వార్త ఆసక్తికరంగా మారింది. తాను జయలలిత అభిమానిని అని గతంలో నయనతార ఓ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

విద్యాబాలన్ పేరు కూడా
ఇదిలా ఉండగా నయనతారతో పాటు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు కూడా జయలలిత పాత్ర కిశోరం పరిశీలిస్తున్నట్లు తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హీరోయిన్ త్రిష జయలలిత పాత్రలో మరో బయోపిక్ ఇదివరకే ప్రకటించారు.

తీవ్రమైన పోటీ
దర్శక నిర్మాతలు ప్రస్తుతం బయోపిక్ చిత్రాలు తెరకేకించేందుకు పోటీ పడుతున్నారు. జయలలిత బయోపిక్ కోసమే నాలుగు ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా తెలుగులో బాలయ్య ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











