twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోపై ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ దర్శకుడు, కోటి తిరిగి ఇవ్వాల్సిందే

    By Srikanya
    |

    చెన్నై: అల్లు అర్జున్ తో చిత్రం చేయటానికి కమిటైన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి. ఆయన కేవలం దర్శకుడుగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలు చేసారు. ఈ నేపధ్యంలో ఆయన ఆర్దిక లావాదేవీలు ఓ నిర్మాతగా హీరోలు ఉన్నాయి.

    అయితే ఓ సారి అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తాన్ని హీరోలు ప్రాజెక్టు కాన్సిల్ అయితే వెనక్కి తిరిగి ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తారా... ఇప్పుడు అదే సమస్య లింగు సామికి వచ్చింది.

    తమిళ సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...డైరక్టర్ లింగు సామి..ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో యంగ్ హీరో శింబు పై కంప్లైంట్ చేసారు. గతంలో లింగు సామీతో ఆయన బ్యానర్ సినిమా చేస్తానని కమిటయ్యి..కోటి రూపాయలు తీసుకున్నారని, అయితే ఆ ప్రాజెక్టు కాకుండా వేరే సినిమా చేస్తూ, తన డబ్బుని వెనక్కి ఇవ్వమంటే ఇవ్వటం లేదని ఆ కంప్లైంట్.

    అయితే ఈ విషయమై ఇంకా శింబు స్పందించలేదు. ఈ కంప్లైంట్ వెనకాల చాలా జరిగింది. అదేంటి అనేది ఇక్కడ చదవండి.

    అప్పుడే తేలాల్సింది..

    అప్పుడే తేలాల్సింది..

    సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్ లో హీరోగా శింబు చేసారు. అయితే లింగు సామి...తన డబ్బు కట్టిన తర్వాతే సినిమా రిలీజ్ పెట్టుకో అని అడ్డు పడ్డారు. దాంతో సినిమా రిలీజ్ ఆగిపోయే పరిస్దితి వచ్చింది. అప్పుడు దర్శకుడు గౌతమ్ మీనన్ సీన్ రావటంతో ఆయన పై గౌరవంతో సినిమా రిలీజ్ కు అడ్డు పడలేదు.

    ఈ విషయమై

    గౌతమ్ మీనన్ ఈ విషయమై ట్వీట్ సైతం చేసారు. ఈ చిత్రం రిలీజ్ విషయంలో సహకరించినందుకు ధాంక్స్ అంటూ స్పందించారు. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    వేరే డైరక్టర్ తో

    వేరే డైరక్టర్ తో

    నిజానికి ఈ గొడవ ఇప్పటిది కాదని తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల క్రితం.... ఏం జరిగిందంటే... శింబుని ఆయన తన స్వంత బ్యానర్ పై నిర్మించే చిత్రం కోసం బుక్ చేసుకున్నారు. భూపతి పాండ్యన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారని చెప్పి డేట్స్ తీసుకున్నారు.

    నిర్మాత, డైరక్టర్ ని మార్చి

    నిర్మాత, డైరక్టర్ ని మార్చి

    అయితే తర్వాత మాట మార్చి దయానిధి అళగిరి నిర్మాతగా ఉంటారని తాను డైరక్ట్ చేస్తానని అన్నారు. అప్పటికీ ఓకే అన్నాక కథ కూడా చెప్పకుండా షూటింగ్ కి శింబుని రెడీ అవమన్నాడు.

    హీరోని మార్చాడు

    హీరోని మార్చాడు

    దాంతో కాలిన శింబు తన డేట్స్ ని వేరే చిత్రానికి కేటాయించాడు. ఇది గమనించిన లింగు స్వామి వెంటనే హీరోని మార్చి ప్రకటన చేసాడు. దాంతో సింబు...పత్రికలకు ఓ ప్రకటన రిలీజ్ చేసాడు. ఆ పత్రికా ప్రకటన సంచలనం సృష్టించింది.

    వంద రోజులు టైమ్ వేస్ట్

    వంద రోజులు టైమ్ వేస్ట్

    తను టెక్నికల్ గా ఏ మిస్టీక్ చేయలేదని, లింగు స్వామి వినిపించే స్క్రిప్టు కోసం వంద రోజులుకు పైగా వేచి ఉన్నానని ఆ తర్వాతనే వానం అనే సినిమా ఓప్పుకున్నానని ఇందులో తన తప్పు ఏమీ లేదని, అయినా స్క్రిప్టు లేకుండా నిర్మాతను అడ్డం పెట్టి సినిమా చేయాలనుకోవటం పద్దతి కాదని అన్నాడు.

    క్షమించరాని నేరం

    క్షమించరాని నేరం

    అలాగే తనను తొలిగిస్తూ ఏక పక్షంగా లింగుస్వామి నిర్ణయం తీసుకోవటం తనను షాక్ కు గురిచేసిందని, నేను సెప్టెంబర్ నుంచి ప్రీగా ఉన్నానని క్లియర్ గా చెప్పానని, ఇది వృత్తి పరంగా చాలా భాద్యతా రాహిత్యమని ఇది క్షమించ రాని నేరమని అన్నారు. దీనిపై లింగు స్వామి ఏ వివరణ ఇవ్వలేదు.

    తమిళ మార్కెట్ లోనూ

    తమిళ మార్కెట్ లోనూ

    సరైనోడు సినిమా తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై సర్వత్రా చర్చ నెలకొంది. కొందరు దర్శకులు బన్నీతో సినిమా చేసేందుకు పోటీ పడుతుంటే ఈ స్టైలిష్ స్టార్ మాత్రం లింగు స్వామి డైరెక్షన్‌లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడట. ఇక ఈ చిత్రం ద్వారా బన్నీ తన మార్కెట్‌ని తమిళంలోను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాడట.

    మళయాళంలోనే కాకుండా..

    మళయాళంలోనే కాకుండా..

    ఇప్పటికే బన్నీకి ఇటు తెలుగులోనే కాక మలయాళంలోను మంచి ఫాలోయింగ్ ఉంది. లింగు స్వామి, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీని తమ జ్ఞానవేల్ రాజా తమ స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిచనుండగా.. తమ కాంబినేషన్‌లో మరో సక్సెస్ సాధించాలని ఈ జోడి ఉవ్విళ్ళూరుతున్నారని సమాచారం.

    తమిళ హీరోలలాగానే

    తమిళ హీరోలలాగానే

    నెగెటివ్ షేడ్ లో కనిపించేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపని ఈ హీరోలు ప్రస్తుతం వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే తమిళంలో అలాంటి ప్రయోగాలు చేసి విజయవంతమైన హీరోలు చాలా మందే ఉన్నారు. అందుకు గాను బన్నీ తాను చేయనున్న తొలి తమిళ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

    ద్విపాత్రాభినయం

    ద్విపాత్రాభినయం

    లింగు స్వామి తెరకెక్కించనున్న ఈ చిత్రం బైలింగ్యుయల్ మూవీగా తెరకెక్కనుండగా ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. స్టైలిష్ గా డిఫరెంట్ లుక్ తో బన్నీ ఈ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. అయితే ఆ పాత్ర అందరిని అలరించడం ఖాయని యూనిట్ భావిస్తోంది.

    క్రేజ్ పెరుగుతుంది

    క్రేజ్ పెరుగుతుంది

    బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు టాక్. ఆ తర్వాత తను తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు బన్నీ. జ్ఞానవేల్ నిర్మాణంలో లింగుస్వామి తెరకెక్కించనున్న ఈ చిత్రం బైలింగ్యుయల్ మూవీగా రూపొందనుండగా తమిళంలోను ఈ హీరో క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Director Lingusamy has filed a complaint against actor Simbu. When we inquired further, it seems that Simbu was given an advance of 1 Crore from Lingusamy for an untitled project. But however the project did not take off as planned. When the director cum producer asked for the return of the advance amount, it seems that the actor prefers to be casted in some other movie instead of returning the money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X