twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్ పేషంట్స్ కోసం ఎవరూ చేయని పని చేసిన డైరెక్టర్..స్పెషల్ డే రోజునే అలా!

    |

    కరోనావైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందడంతో, వైరస్ కేసులు కూడా భారీ నమోదు అవుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు లేకపోవడం మరియు ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇక కరోనా వైరస్ సంబంధిత సహాయ నిధి కోసం రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు అన్ని వర్గాల ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఈ వైరస్‌తో పోరాడుతున్న వారి చికిత్స కోసం వారు చేస్తున్న సహాయం ఎంతో సహాయపడుతుంది అని అంటున్నారు.

    అయితే ఈ నేపథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు లింగుస్వామి కరోనావైరస్ రోగుల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. మనప్పక్కంలో ప్రారంభించిన ఆశ్రమాన్ని బుధవారం నాడు ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. మంత్రి టిఎం అన్బరసన్, నటి కీర్తి సురేష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దర్శకుడు మొన్ననే పరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే స్పెషల్ డేని ఇలా ప్రజల కోసం ఉపయోగపడేలా ప్లాన్ చేశారు.

     Lingusamy opens ashram for COVID19 patients

    ఇక మహమ్మారి సమయంలో తన ప్రాణాల గురించి భయపడకుండా ప్రజలకు సహాయం చేయడానికి ఉదయ్ చేసిన సాహసోపేతమైన చర్యలను లింగుస్వామి ప్రశంసించారు. ఆయనలో తాత కరుణానిధి యొక్క తెలివితేటలు మరియు తండ్రి స్టాలిన్ యొక్క గొప్ప మనసు కలిసి ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ఇక రామ్ పోతినేనితో లింగుస్వామి కొత్త సినిమా లాంచ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ లాంఛనంగా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో షురూ అయింది. త్వరలో రెగ్యులర్ షూట్ కూడా ఉండనుందని అంటున్నారు.. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనల్ చేశారు.

    English summary
    Director Lingusamy has completed twenty years in the film industry on Wednesday. on this occasion He opened an ashram for COVID19 patients in Manapakkam, Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X