లోకేష్ ప్లాన్ ఒకటైతే.. అమీర్ ఖాన్ చేసిందొకటి.. కూలికి భారీ నష్టం?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. తొలుత మా నగరం చిత్రంతో ప్రేక్షకులకు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత సంచలనంగా మారుతున్నాయి. ఇక నెక్ట్స్ రజనీకాంత్ కూలి చిత్రంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ బాలీవుడ్ స్టార్ చేసిన ఓ పనివల్ల ఆయన ప్లాన్ లో కాస్తా మార్పులు చోటుచేసుకున్నాయని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కూలి ప్రమోషన్స్ లో బిజీ..
కోలీవుడ్ లో భారీ బడ్జెట్ రూపుదిద్దుకున్న చిత్రం కూలి. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తమిళ చిత్ర పరిశ్రమలో పేరు మోసిన నిర్మాత కళానిధి మారన్ రూ.350 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తైంది. ఇక వచ్చే నెలలోనే విడుదల కాబోతుండటంతో మేకర్స్, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇక తాజాగా కూలి సినిమాపై భారీ అంచనాలను పెంచేలా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పవర్ ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Lokesh Kanagaraj big plan with Amir Khan in Coolie Movie

అమీర్ ఖాన్ వల్ల బయట పడ్డ రహస్యం..
లోకేష్ కనగరాజ్ తన చిత్రాల్లో క్యామియో పాత్రలతో ఇచ్చే సర్ ప్రైజ్ కు ఆడియెన్స్ లో నెక్ట్స్ లెవల్ రెస్పాన్స్ ఉంటుంది. విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫజిల్ వంటి వారు నటించినా.. క్యామియోలో సూర్యను రోలెక్స్ గా చూపించి సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. 3 నిమిషాలు కనిపించే సూర్య రోలెక్స్ పాత్ర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక రజనీకాంత్ కూలి చిత్రంలోనూ అమీర్ ఖాన్ క్యామియోతో సంచలనం సృష్టించాలనుకున్నారంట. అందుకే ఆయన పాత్ర గురించి బయట ఏమాత్రం తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సర్ ప్రైజ్ మిస్..
కానీ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం కూలి చిత్రంలో తన క్యామియో అప్పీయరెన్స్ ఉందని రివీల్ చేశారన్నారు. దీంతో సినిమాలోని ఇంట్రెస్టింగ్ సర్ ప్రైజ్ మిస్స్ అయినట్టుగా భావించారు. అమీర్ ఖాన్ రీసెంట్ ఫిల్మ్ సితారే జమీన్ పర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఓపెన్ అయ్యారన్నారు. కెమెరా ముందు అబద్ధం చెప్పలేనని అనడంతో తను కూడా సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందన్నారు. ఇక కూలి చిత్రంపై తనకు భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

టాప్ స్టార్స్..
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్దే, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న తమిళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించడం విశేషం.

More from Filmibeat

Read more about: lokesh kanagaraj amir khan coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X