విక్రమ్ తరువాత ఆ పాత్రను డీ కొట్టబోతున్న ఖైదీ.. రెండు సినిమాలను మిక్స్ చేయబోతున్న మాస్టర్ డైరెక్టర్
కమల్ హాసన్ చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బలమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా విజయంతో కమల్ హాసన్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ఇప్పటికే ప్రత్యేకమైన కానుకలు ఇచ్చాడు. మరోవైపు లోకేష్ కనగరాజ్ అయితే ఈ ఆనందాన్ని మరింతగా కొనసాగించాలని ఫ్రాంచజ్ గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక తదుపరి సినిమాలో ఖైదీ క్యారెక్టర్ ను కూడా జత చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరో వండర్
ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఆ తరువాత మాస్టర్ సినిమాతో పరవాలేదు అనిపించాడు. ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ను అంతకా ఆకట్టుకోక పోయినప్పటికీ విజయ్ vs విజయ్ సేతుపతి పాత్రలు ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఆ ఫార్ములా వర్కౌట్ కావడంతో లోకేష్ విక్రమ్ సినిమాలో అంతకు మించి అనేలా కమల్ తో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ లతో మరో వండర్ క్రియేట్ చేశాడు.

300కోట్లకు చేరువలో..
ఇక విక్రమ్ సినిమా తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో భారీ వసూళ్లను అందుకుంది. దాదాపు 40కోట్లకు పైగా ప్రాఫిట్ లో ఉన్నట్లు సమాచారం. ఇక 300కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కు చేరువలో ఉన్నట్లు సమాచారం. అసలు ఈ సినిమా సక్సెస్ ఈ రేంజ్ లో ఉంటుంది అని ఎవరు ఊహించలేదు. విడుదల ముందు వరకు కూడా తెలుగులో పెద్దగా హైప్ లేదు. ఇక విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తోనే కలెక్షన్స్ పెరిగాయి.

పవర్ఫుల్ ఫ్రాంచైజ్ లు
విక్రమ్ సినిమా సాధించిన విజయంతో దర్శకుడు లోకేష్ కు మరింత బలం చేకూరింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో సూపర్ హీరోలను కలుపుతున్నట్లు పవర్ఫుల్ హీరోలను ఓకే సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లోకేష్ ఆలోచనా విధానంతో విక్రమ్ సినిమాకు పవర్ఫుల్ ఫ్రాంచైజ్ లు రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం

రంగంలోకి ఢిల్లీ
ఇక ఆ సినిమాలకు సంబంధించిన తదుపరి సీక్వెల్ లో విక్రమ్ ను మరింత బలమైన పాత్రలు ఎదుర్కొంటాయట. ముఖ్యంగా ఖైదీ క్యారెక్టర్ ను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖైదీ సినిమాలో కార్తీ ఢిల్లీ పాత్రలో ఎంతగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతని పాత్రను మరింత ముందుకు సాగించాలని అనుకుంటున్నాడట.

రోలెక్స్ vs ఢిల్లీ
కమల్ హాసన్ మాత్రమే కాకుండా రోలెక్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. అందులో ఖైదీ ఢిల్లీ పాత్ర అలాగే విక్రమ్ రోలెక్స్ క్యారెక్టర్ రెండు కూడా పోటాపోటీగా రంగంలోకి దిగుతాయాని తెలుస్తోంది. సూర్య బ్రదర్స్ ఇప్పటికే ఒక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా లోకేష్ వీరిద్దరిని కలిపితే మాత్రం మాములుగా ఉండదని చెప్పవచ్చు. మరి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











