ఆ హీరోయిన్‌తో ఎఫైర్? రెండో ఫ్యామిలీ అంటూ రూమర్స్... స్టార్ డైరెక్టర్ సీరియస్
చిత్ర పరిశ్రమలో నటీనటులు, టెక్నీషియన్స్ మధ్య రిలేషన్, డేటింగ్, ఎఫైర్స్ జరుగుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిజమైతే.. మరికొన్ని మాత్రం కేవలం సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ మాత్రమే. హీరోలే కాదు... దర్శకులు కూడా హీరోయిన్లు, ఇతర మహిళా నటులతో ఎఫైర్ నడిపినవారే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి యవ్వారాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మీడియాలో వచ్చే గాసిప్స్ కారణంగా సెలబ్రిటీలు, వారి కుటుంబాలు ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో కొందరు జర్నలిస్టులు మీడియా సమావేశాల్లో హీరో హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లను అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొన్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
లోకేష్ సినిమాలకు కలెక్షన్ల వర్షం
తమిళ చిత్ర పరిశ్రమలో అపజయం అనేది లేని దర్శకుడిగా లోకేష్ కనగరాజ్‌కు పేరుంది. షార్ట్ ఫిలింస్, చిన్నాచితకా సినిమాలతో కెరీర్ ప్రారంభించిన లోకేష్.. చాలా తక్కువ సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్ వంటి అగ్రనటులతో సినిమాలు తీసే రేంజ్‌కు ఎదగడటంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. లోకేష్ తెరకెక్కించిన అవియల్, మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో గతేడాది లోకేష్ తీసిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికీ ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో లోకేష్ తన సత్తా చాటారు.

తెలుగులోనూ లోకేష్‌కు క్రేజ్
కూలీ పరాజయం తర్వాత లోకేష్‌పై ఇంటా బయటా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన టేకింగ్‌పై మాత్రం ఎవ్వరికీ అనుమానం లేదు. లోకేష్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉందని అంతా అనుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ లోకేష్ కనగరాజ్‌కు, ఆయన సినిమాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. త్వరలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇది లోకేష్‌కు తెలుగులో దర్శకుడిగా తొలి సినిమా. ఈ పాన్ ఇండియా మూవీపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఖైదీ 2పై లోకేష్ క్లారిటీ
తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సినిమాతో పాటు ఖైదీ 2 వాయిదా పడిందన్న దానిపైనా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)కు బ్రేక్ పడలేదు. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యాను.. ఈ మాట ప్రకారం అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్‌లో గెస్ట్ రోల్ పోషించినట్లు వెల్లడించారు. అలాగే రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తోన్న బెంజ్ మూవీకి తానే కథను అందించానని.. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనని ఆయన తెలిపారు.
రెండో ఫ్యామిలీ వద్దా
ఇదిలాఉండగా.. ఇదే మీడియా సమావేశంలో లోకేష్ కనగరాజ్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కోలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. మీరు ఓ హీరోయిన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి.. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? అని మీడియా ప్రతినిధి అడిగాడు. దీనిపై షాకైన లోకేష్... ఆ తర్వాత తేరుకుని నాకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని ఆన్సర్ చెప్పి వదిలేశారు. అయినప్పటికీ సదరు జర్నలిస్ట్ మాత్రం పదే పదే ఈ ప్రశ్న అడుగుతూ.. రెండో ఫ్యామిలీ వద్దా అంటూ ప్రశ్నించాడు. దీనిపై లోకేష్ సీరియస్ అయినా మౌనం వహించారు. వెంటనే ప్రెస్‌మీట్‌ను ముగించి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సదరు జర్నలిస్ట్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.


Click it and Unblock the Notifications











