మరో స్టార్ హీరోతో రజినీకాంత్ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. కిక్కిచ్చే అప్డేట్
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అభిలనుల అంచనాలను అందుకోవడం అంటే చాలా కష్టమైన పని. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే అంతకుమించి ఏదో ఉండాలనే కోరుకుంటారు. హీరోలు అలాంటి సినిమాలను చేయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. కానీ అందుకు తగ్గట్లు బలమైన కథలు కాస్త కరువయ్యాయనే చెప్పాలి. ఇక గత కొంతకాలంగా రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ పై వస్తున్న రూమర్స్ పై మొత్తానికి ఒక స్టార్ దర్శకుడు వివరణ ఇచ్చారు.

తేడా వస్తే తట్టుకోలేమని..
కమల్ హాసన్, రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటి నుంచో కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి కథా చర్చలు చాలానే జరిగాయి. కానీ సెట్టవ్వలేదు. బడా హీరోలను ఒకే తెరపై సమానంగా చూపించాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాస్త తేడా వచ్చినా అభిమానుల ఆవేశాన్ని తట్టుకోలేరు. అందుకే హీరోల రేంజ్ సమానంగా ఉండే కథ కోసం ఎదురుచూస్తున్నారు.

రాజకీయాల కోసం ఒక సినిమా..
అయితే కమల్ హాసన్, రజినీకాంత్ రాజకీయాల కోసం ఒకటి కాబోతున్నారు అనే వార్తలు కూడా గతంలో గట్టిగానే వచ్చాయి. రజినీకాంత్ కూడా ఒక ప్రెస్ మీట్ లో భవిష్యత్తు తమిళ రాజకోయల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రజినీ కమల్ కలిసే ముందు ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ప్రాజెక్ట్ అతని చేతుల్లోకి..
ఇక ఈ బిగ్ కాంబినేషన్ పై తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజన్ ఒక వివరణ ఇచ్చారు. ఆ దర్శకుడు మరెవరో కాదు. కార్తీ ఖైదీ సినిమాకు అలగే విజయ్ మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజన్. రజినీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్ట్ ఇతని చేతుల్లోకే వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

సెప్టెంబర్ లో గుడ్ న్యూస్..
ఇప్పటికే కొన్ని చర్చలు ముగిసాయని చెప్పిన లోకేష్ ఇద్దరు స్టార్ హీరోలు సినిమా చేయడానికి సంతృప్తిగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక్కసారి అగ్రిమెంట్ కుదిరితే సెప్టెంబర్ లోనే అభిమానులకు గుడ్ న్యూస్ అందవచ్చని లోకేష్ వివరణ ఇచ్చారు. ఇక రజిని కమల్ ప్రాజెక్టును కమల్ హాసన్ తన సొంత ప్రొడక్షన్ లోనే రూపొందించనున్నాడట. మరి ఆ చారిత్రాత్మక కాంబినేషన్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











