twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లోకి హర్భజన్ సింగ్ ఎంట్రీ.. స్పిన్నర్ సరసన హీరోయిన్ ఎవరంటే!

    |

    హర్భజన్ సింగ్ అంటే బంతితో బ్యాట్స్‌మెన్స్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భారతీయ క్రికెటర్‌గానే గుర్తొస్తారు. క్రికెట్ మైదానంలో తన బంతితో ముప్పు తిప్పలు పెట్టిన ఈ స్పిన్నర్ ఇక వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత కొద్దికాలం క్రితం క్రికెట్‌కు దూరమైన హర్భజన్ సింగ్ ఇప్పుడు యాక్టింగ్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఎన్నో యాడ్స్‌లో నటించిన అనుభవంతో తమిళంలో ఫ్రెండ్‌షిప్ అనే సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యాం సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టోవా స్టూడియో అండ్ సినిమాస్ స్టూడియో బ్యానర్‌పై జేపీఆర్ అండ్ స్టాలిన్ నిర్మిస్తున్నారు.

    ఫ్రెండ్‌షిప్ మూవీలో మరో సెన్సేషనల్ స్టార్ యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే తమిళ నటుడు సతీష్ కూడా ప్రధానమైన పాత్రలో కనిపిస్తారు. అంతేకాకుండా బిగ్‌బాస్ 3 తమిళ ఫేం లాస్లియా మారియనేషన్ ఈ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఫ్రెండ్ షిప్‌ సినిమాలో హర్భజన్ సరసన లాస్లియా మారియనేషన్ హీరోయిన్‌గా కనిపిస్తారు.

     Losliya Mariyanesan as heroine in Cricketer Harbhajan Singh Friendship

    కాగా, ఇటీవల విడుదలైన ఫ్రెండ్‌షిప్ ఫస్ట్‌లుక్ బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పనిచేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మరికొందరి నటీనటుల పేర్లను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Popular Indian Cricketer Harbhajan Singh making his acting debut with a Tamil film titled 'Friendship'. Bigg Boss 3 Tamil fame Losliya Mariyanesan is also making her acting debut and She will be seen as female lead with Harbhajan Singh in the film. The first look which was released recently has created very good positive buzz around the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X