తీవ్ర విషాదంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్.. తండ్రి మరణంతో షాక్‌లో

బిగ్‌బాస్ తమిళ కంటెస్టెంట్ లోస్లియా జీవితంలో విషాదం చోటుచేసుకొన్నది. లోస్లియా తండ్రి మారియానేసన్ ఆకస్మికంగా మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. లోస్లియా కన్నీటి సాగరంలో మునిగిపోవడంతో ఆమె అభిమానులు షాక్ గురయ్యారు. లోస్లియా తండ్రి మరణం ఎలా జరిగిందంటే..

శ్రీలంక న్యూస్ రీడర్‌గా

శ్రీలంక న్యూస్ రీడర్‌గా

తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో లోస్లియా మారియానేసన్ తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్‌ షోలో చేరిన తర్వాత శ్రీలంకకు చెందిన న్యూస్ రీడర్‌కు అనూహ్యంగా అభిమానులను సంపాదించుకొన్నారు. బిగ్‌బాస్ తర్వాత భారీగా క్రేజ్ లభించింది. అలా ఆమె స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు.

 బిగ్‌బాస్‌లో ఉండగా ఇంటిలోకి మారియానేసన్

బిగ్‌బాస్‌లో ఉండగా ఇంటిలోకి మారియానేసన్

ఇక లోస్లియా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తండ్రి మారియానేసన్ ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో తండ్రిని చూసి ఎమోషనల్‌గా మారి కంటతడి పెట్టుకొన్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఆ ఫోటోలు చెప్పాయి.

కెవిన్‌తో లోస్లియా రిలేషన్‌షిప్

కెవిన్‌తో లోస్లియా రిలేషన్‌షిప్

బిగ్‌బాస్ ఇంటిలో ఉండగానే తోటి కంటెస్టెంట్ కెవిన్‌తో ప్రేమలో పడ్డారు. తనతో రిలేషన్ కొనసాగిస్తున్న సమయంలోనే మారియానేసన్ ఇంట్లోకి వచ్చారు. కెవిన్‌తో రిలేషన్‌షిప్ గురించి తగిన, సరైన నిర్ణయం తీసుకోవాలని లోస్లియాకు మారియానేసన్ సలహా ఇవ్వడం ఆకట్టుకొన్నది.

 తండ్రి అంటే లోస్లియాకు ప్రాణం కంటే మిన్నగా

తండ్రి అంటే లోస్లియాకు ప్రాణం కంటే మిన్నగా

లోస్లియాకు తండ్రి మారియానేసన్ కెనడాలో ఉద్యోగం చేశారు. ఆయనతో అనుబంధం మాటల్లో చెప్పలేనది. తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొంటానని గతంలో ఆమె మీడియాకు వెల్లడించారు. తనకు ప్రాణంగా మారిన తండ్రి ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న లోస్లియాను స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Biggboss Tamil Season 3 Contestants Complete Details | Biggboss Tamil 3 | Kamal Haasan | Filmibeat
హర్భజన్ సింగ్‌తో ఫ్రెండ్‌షిప్ మూవీలో

హర్భజన్ సింగ్‌తో ఫ్రెండ్‌షిప్ మూవీలో

బిగ్‌బాస్ తమిళ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో క్రేజీ సెలబ్రిటీగా మారింది. న్యూస్ రీడర్ నుంచి ఆమె యాక్టర్‌గా మారిపోయారు. బిగ్‌బాస్ తర్వాత నటనపైనే దృష్టి పెట్టారు. కెవిన్‌తో అఫైర్‌కు ముగింపు పలికి కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం క్రికెటర్ హార్బజన్ సింగ్ నటిస్తున్న ఫ్రెండ్‌షిప్ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X