యువ హీరోయిన్ తో స్టార్ హీరో కొడుకు ప్రేమాయణం.. ఈ వయసులోనే అంత స్పీడా?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని నటన ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో సినిమా ప్రపంచంలో హీరోగా గుర్తింపు అందుకున్నాడు. అయితే అతని కొడుకు ధృవ్ మాత్రం కొన్నిసార్లు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. అతనిపై అనేక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇక హీరోగా కెరీర్ ని మొదలు పెట్టిన ధృవ్ ఒక యువ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి రీమేక్ తో
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా విక్రమ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. అతని కుమారుడు ధృవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అతను మాత్రం మొదటి సినిమాతోనే ఊహించనివిధంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్ గా వచ్చిన ఆదిత్య వర్మ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

రీ షూట్..
అసలైతే మొదట అర్జున్ రెడ్డి రీమేక్ ను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. తన కెరీర్ ను అద్భుతంగా స్టార్ట్ చేశాడని విక్రమ్.. డైరెక్టర్ బాలాను సెంటిమెంట్ గా తన కొడుకు సినిమాకు కూడా దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు. సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను నిర్మించడం జరిగింది. కానీ సినిమా అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆ సినిమాను క్యాన్సిల్ చేసి మరోసారి షూట్ చేశారు.

నటుడిగా మంచి క్రేజ్
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా కు సహాయ దర్శకుడిగా చేసిన గిరిషయా అర్జున్ రెడ్డి రీమేక్ ను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు. ఇక ధృవ్ కి నటుడిగా ఆ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక ఆ సినిమాలో హీరోయిన్ పాత్రలో బానిత సందూ నటించింది.

ఇద్దరి మధ్యలో..?
అయితే ప్రస్తుతం ధృవ్, బానితా తో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా వీరిపై కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. బానితా సందు బాలీవుడ్కు దగ్గర కావడంతో ఆమెపై చాలా కథనాలు వెలువడుతున్నాయి.

ఫారిన్ టూర్ లో..
వీరిపై ఈ తరహాలో రూమర్స్ రాకపోవడానికి కారణం లేకపోలేదు. ఆదిత్య వర్మ సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇంకా వీరి సాన్నిహిత్యం అలానే ఉంది. ఇద్దరూ కూడా కలిసి ఫారిన్ టూర్ లో కూడా వెళుతున్నారు. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా దుబాయ్ కూడా వెళ్లారు. అక్కడ బానితాకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ను కూడా ధృవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ గా మారింది.

ఫ్యాన్స్ నాట్ హ్యాపీ..
ఏదేమైనా కూడా తండ్రి తరహాలో నటుడిగా మంచి క్రేజ్ అందుకుంటాడని అనుకున్న ధృవ్ ఇలా ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలవడం విక్రమ్ ఫ్యాన్స్ కు రుచించడం లేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఈ జంట ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











