లవ్ టుడే హీరోకు బంపర్ ఆఫర్.. ఏకంగా కమల్ హాసన్ తో చిత్రం! డైరెక్టర్ ఎవరంటే?

ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహించడం అంటే మాములు విషయం కాదు. అంతేకాకుండా ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా తెరకెక్కించడం అతికొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలా గతేడాది రిషబ్ శెట్టి కాంతార సినిమాతో నిరూపించుకోగా.. మరో హీరో కథానాయకుడిగా, డైరెక్టర్ గా అదరగొట్టి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమానే లవ్ టుడే. అతని పేరు ప్రదీప్ రంగనాథన్. తమిళంలో చిన్న లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే చాలా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో వచ్చిన కోమలి సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్ గా సైమా అవార్డు అందుకున్నాడు. గతేడాది మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. నవంబర్ 25న తెలుగులో విడుదలైన యూత్ ఫుల్ లవ్ అండ్ ఫన్ రొమాంటిక్ మూవీ లవ్ టుడే సక్సెస్ ఫుల్ గా సత్తా చాటింది.

Love Today Pradeep Ranganathan Get A Chance In Kamal Haasan Production Banner

సోషల్ ఎలిమెంట్స్ కు కామెడీ హంగులను అద్ది ఫైనల్ గా మంచి మెసేజ్ ఇవ్వడం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్టైల్. అలా 2019లో కోమలి సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఇక ఈసారి అయితే అతనే హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన మూవీ లవ్ టుడే. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు మంచి వసూళ్లు కురిపించింది. తెలుగులో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదిలా ఉంటే లవ్ టుడే హీరో అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కు బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణమైన రాజ్ కమల్ ఫిలీంస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి హీరోగా నటించే అవకాశం దక్కింది. ఇందుకు ప్రదీప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రదీప్ రంగనాథన్ ఇమేజ్ కి తగినట్లుగా విభిన్నమైన కథాంశంతో విఘ్నేష్ కథను రెడీ చేశారట. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని విఘ్నేష్ కి ఈ సినిమా వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X