twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికా శెరావత్ స్టెప్ కు ఎల్లారేశ్వరి పాట

    By Srikanya
    |

    మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల... పాటతో ఓ తరాన్ని ఉర్రూతలూగించిన ఎల్లారేశ్వరిని మర్చిపోవటం కష్టమే.ఇంత వయస్సులో కూడా ఆమె హస్కీ వాయిస్ కి డిమాండ్ తగ్గలేదు. అందుకే తమిళంలో ఆమె చేత పాట పాడించి అందుకు బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ చేత స్టెప్స్ వేయించారు. ఇందంతా శింబు హీరోగా రూపొందుతున్న దబాంగ్ రీమేక్ ఓస్తి కోసం చేసారు. ఈ రీమేక్ లో శింబు సరసన లీడర్ భామ రిచా గంగోపాధ్యాయ నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా హిందీలో మలైకా అరోరాఖాన్ చేసిన మున్నీ బద్‌నామ్ హుయి పాటను తమిళంలో మల్లికా శెరావత్ చేశారు. ఈ పాటలో మల్లికా కనబర్చిన అభినయం చూసి ఓస్తి యూనిట్ సభ్యులు తెగ ముచ్చటపడ్డారట. ఈ పాటను మల్లికా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని చేశారు. దానికి కారణం హిందీ మున్నీ బద్‌నామ్ హుయి* పాటలో మలైకా కనబర్చిన అభినయమే. మలైకాని తలదన్నే విధంగా ఉండాలని ఫిక్స్ అయ్యి మల్లికా శెరావత్ ఈ పాటలో రెచ్చిపోయానని చెప్తోంది.

    కళాశాల... అనే పదంతో ఆరంభమయ్యే ఈ పాట ఇప్పుడు చెన్నయ్‌లో ఎక్కడ చూసినా ఇదే వినపడుతోంది. ఇక ఎల్లారేశ్వరితో తో పాటు శింబు తండ్రి టి.రాజేందర్ కూడా ఈ పాటలో గొంతు కలపారు. శింబు, మలైకా, సోనూసూద్, గ్రూప్ డాన్సర్లపై రాబర్ట్ నృత్యదర్శకత్వంలో ఈ పాటను చిత్రదర్శకుడు ధరణి చిత్రీకరించారు. ఈ పాట గురించి మల్లికా శెరావత్ చెబుతూ హిందీ మున్నీ... కన్నా తమిళ్ కళాశాల చాలా బాగుంది.ఫోక్, మెలోడి మిక్స్ అయిన ఈ ట్యూన్ చాలా జోష్‌గా ఉంది. ఈ పాటలో చేసే అవకాశం నాకే రావడం ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో నేనెక్కువగా కళాశాల.. పాటనే హమ్ చేస్తున్నాను. అంతగా నచ్చేసింది అన్నారు. తెలుగులోనూ దబాంగ్ ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్నారు. మరి ఈ పాటకు ఎవరిని తీసుకుంటారనేది ఇంకా ఫైనల్ కాలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    English summary
    Simbu said "Kalasala is going to be a rocking song of the album. The entire team including me, Taman, dad, felt that the song will become as catchy and popular, like the original song. LR Eswari vocal is an added essence to this hot item number".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X