Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
'రోబో'కు తీవ్రవాదుల (LTTE ) సాయం?
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు (కుసేలన్, రోబో) లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(LTTE) తీవ్రవాద సంస్థ ఆర్థికసాయం అందించిందని శ్రీలంకకు చెందిన మంత్రి అబ్దుల్ రిషాద్ చేసిన ఆరోపనలు సంచలనం సృష్టించాయి. డబ్బు నేరుగా అందలేదని, లండన్ లోవున్న ఓ తమిళుడి ద్వారా ఇక్కడ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. అంతే కాకుండా రజనీకాంత్ రక్తంలో తడిసిన డబ్బు తీసుకొని, విలాసవంతంగా బ్రతికేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ప్రస్తుతం ఎందిరన్(రోబో) షూటింగ్ కోసం చెన్నైలోనే వున్న రజనీకాంత్ ఈ వ్యాఖ్యలపై మౌనం వహించాలని నిర్ణయించుకున్నారట. కానీ కోలీవుడ్ లో ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. దీనిపై తమిళనాడు నిర్మాతల సంఘం అధ్యక్షుడు రామనారాయణన్ స్పందిస్తూ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు తీవ్రవాద సంస్థల నుండీ ఆర్థికసాయం ఆశించాల్సిన అవసరం లేదని, ఆయన ఒప్పుకుంటే సినిమాలు తీయడానికి ఇక్కడ ఎంతో మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారని, కేవలం ప్రచారం కోసమే ఇలాంటి అర్థం లేని ఆరోపనలు చేస్తారని చెప్పారు.
ఏదిఎలా వున్నా ఇలాంటి ఆరోపనల వల్ల సినిమాలకు మంచి పబ్లిసిటీ లభిస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.