Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వివాదాస్పదంగా మారిన దర్బార్ సీన్లు.. తీసేసినట్టు ప్రకటించిన నిర్మాతలు
ఒక సినిమాలో సన్నివేశానికి అనుగుణంగానే మాటలు రాసినా.. అవి బయటి వ్యక్తుల్లో ఎవరికో ఒకరికి తాకినట్టుగానే అనిపిస్తాయి. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంటుంది. బయట జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని సీన్స్ పెడుతుంటారు.. డైలాగ్స్ రాస్తుంటారు. అలా రాసే సీన్లు, మాటలపై సెన్సార్ సభ్యుల నుంచి అనుమతి లభించినా.. కొందరు మాత్రం వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలకు బెదిరింపులు, హెచ్చరికలు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే దర్భార్ చిత్రానికి ఎదురైంది.

ఘన విజయం సాధించిన దర్బార్..
ఏ ఆర్ మురుగదాస్-సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో సినిమా వస్తుందంటేనే.. అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక దర్బార్ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక రజినీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. మొత్తానికి ఈ చిత్రం విడుదలై తమిళ నాట అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయంతో పాటే విమర్శ కూడా వచ్చింది.
|
జైలు సీన్ వైరల్..
ముంబై సిటీ కమీషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజినీ) జైలు, అందులోని వీఐపీ ఖైదీల గురించి చెబుతూ..డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసి రావచ్చు అనే డైలాగ్ సందర్భాను సారమే అయినా తమ నాయకురాలిని కించపరిచేలా, ఆమెను ఉద్దేశించే అన్నట్లుగా ఉందని అనుచరులు రచ్చ చేస్తున్నారు.

వివరణ ఇచ్చినా..
అయితే అది వినోదం కోసమే పెట్టామని, ఎవరినీ ఉద్దేశించినది కాదని నిర్మాతలు వివరణ ఇచ్చినా, ఈ డైలాగ్ తమ నేత శశికళను ఉద్దేశించినదేనని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది రోజు రోజుకు పెరిగి పెద్దవి అవుతుండటంతో వివాదస్పదంగా మారిన సీన్, డైలాగ్‌ను తీసేశామని చిత్రయూనిట్ ప్రకటించింది.

వాటిని తొలగించిన నిర్మాతలు..
విజయవంతంగా దూసుకుపోతున్న దర్బార్‌కు ఇలాంటి వివాదాలు ఎందుకన్నట్టుగా వారు అభ్యంతరం వ్యక్తం చేసిన సీన్లు తీసినట్టుగా ప్రకటన చేశారు. ఇక నుంచి అవి లేకుండా సినిమా ప్రదర్శితమవుతుందని తెలిపారు. తొలిరోజే దాదాపు వంద కోట్లు కొల్లగొట్టిన దర్బార్.. తమిళ నాట అప్రతిహతంగా దూసుకుపోతోంది.