దర్శకుడు శంకర్‌కు నోటీసులు... ముదురుతున్న ఇండియన్ 2 వివాదం
హాలీవుడ్ స్థాయి టాలెంట్ ఉన్న భారతీయ దర్శకుల్లో శంకర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇటీవల రూపొందించిన 2.0 చిత్రం ఆయన ప్రతిభకు సాక్ష్యంగా నిలిచింది. 2.0 సెన్సేషనల్ విజయం తర్వాత ఇండియన్ 2 సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. 1996లో భారతీయుడు అనే సినిమాను రూపొందించి అద్భుతమైన విజయాన్ని అందుకొన్నారు. దానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 రూపొందించాలనే లక్ష్యంతో సినిమాను జనవరిలో వైభవంగా ఆరంభించారు. కాజోల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా ఆగిపోయింది.
తమిళ మీడియా కథనాల ప్రకారం.. ఇండియన్ 2 సినిమా బడ్జెట్‌ను నిర్మాతలకు, లైకా ప్రొడక్షన్‌కు వెల్లడించకపోవడమే వివాదానికి కారణమైంది. అంతేకాకుండా కమల్ హాసన్ మేకప్ సమస్యలు కూడా సినిమా ఆగిపోవడానికి కారణంగా మారాయి. అయితే లైకా ప్రొడక్షన్ సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ చేతికి అందించారు. దాంతో శంకర్‌పై లైకా ప్రొడక్షన్ మండిపడినట్టు తెలిసింది.

ఇండియన్ 2 సినిమా విషయంలో మాతో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. వాటిని శంకర్ పరిష్కరించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే ప్రసక్తి ఉండదు. ఈ వివాదం నేపథ్యంలో శంకర్‌కు లీగల్ నోటీసులు పంపనున్నామని లైకా ప్రొడక్షన్ వెల్లడించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











