నయనతార ప్రియుడితో స్టార్ హీరో బడా ప్రాజెక్ట్.. అఫీషియల్ గా ప్రకటించిన లైకా!

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నయనతార బాయ్ ఫ్రెండ్ పేరు బాగానే వైరల్ అవుతుంది. ఒక విధంగా అతని సినిమాల కంటే కూడా అతని ప్రేమ వ్యవహారమే అతనికి సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మొదట నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విగ్నేష్ శివన్ ఆ తర్వాత దర్శకుడిగా మారి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక ఇటీవల మరొక స్టార్ తో సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ పై బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆ హీరోతోనే

ఆ హీరోతోనే

దర్శకుడు విగ్నేష్ శివన్ ఇటీవల ఒక స్టార్ హీరో తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక ఆ హీరో ఎవరు అనే విషయం లో కూడా పలు రకాల రూమర్స్ వచ్చాయి. ఇటీవల వలిమై సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అజిత్ తోనే విగ్నేష్ సినిమా చేయబోతున్నట్లు బలమైన టాక్ వినిపించింది.

 పవర్ఫుల్ కాంబినేషన్

పవర్ఫుల్ కాంబినేషన్

ఇక రీసెంట్ గా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఆ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. అజిత్ కుమార్ 62 వ సినిమాను విగ్నేష్ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ యువ సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నట్లుగా ప్రకటన ఇచ్చారు. ఈ పవర్ఫుల్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన ట్యాగ్స్ ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాయి.

 విడుదల ఎప్పుడంటే..

విడుదల ఎప్పుడంటే..

ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ ను కూడా లైకా ప్రొడక్షన్స్ ముందుగానే తెలియజేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుపెట్టి ఈ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో విడుదల చేయనున్నట్లు గా వివరణ ఇచ్చారు. ఇక సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టెక్నీషియన్స్ ని అలాగే మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తామని లైకా ప్రొడక్షన్స్ వారు వివరణ ఇచ్చారు.

నయన్ తో పెళ్లి?

నయన్ తో పెళ్లి?

నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి పలు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తున్నారు. ఇక పుట్టినరోజు వేడుకలు జరిగితే విదేశాలకు వెళ్ళి అక్కడే కొన్నాళ్ళు ప్రేమ యాత్రలో మునిగితేలుతూ ఉంటారు.

 పెద్దగా స్పందించకుండా..

పెద్దగా స్పందించకుండా..

నయనతార విగ్నేష్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాస్త చురుగ్గానే పాల్గొంటారు. వారి ప్రేమకు సంబంధించిన ఫొటోలను హ్యాపీ మూమెంట్స్ ను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక వీరి ప్రేమ వ్యవహారం పై ఎన్నో కథనాలు వెలువడినా కూడా వాటిపై పెద్దగా స్పందించకుండా వారికి నచ్చిన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X