Mission: Chapter 1 లైకా చేతికి మిషన్: చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్.. సుభాస్కరన్ ఎన్ని కోట్లకు కొన్నాడంటే?
తమిళ సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలోను, ఖర్చుకు వెనుకాడకుండా అగ్ర హీరోల చిత్రాలను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్ బ్యానర్ తన ప్రత్యేకతను చాటుకొన్నది. కంటెంట్ ప్రధానమైన చిత్రాలను నిర్మించడంలో లైకా అధినేత సుభాస్కరన్ ముందుంటారు. 2.0, పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ చిత్రాలను నిర్మించారు. ఆ కోవలోనే తమిళ నటుడు అరుణ్ విజయ్ నటించిన మిషన్: చాప్టర్ 1 చిత్రానికి సంబంధించిన నాలుగు భాషలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మిషన్: చాప్టర్ 1 చిత్రం వివరాల్లోకి వెళితే..

మిషన్: చాప్టర్ 1 చిత్రాన్ని ఎం రాజశేఖర్, ఎస్ స్వాతి నిర్మించారు. దర్శకుడు విజయ్ రూపొందించిన ఈ చిత్రం నాలుగు భాషల్లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా కోసం చెన్నైలో భారీ సెట్ నిర్మించారు. లండన్‌లోని జైలు సెట్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. జైలుకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలను రాత్రిపూట వేగంగా చిత్రీకరించారు. అరుణ్ విజయ్, అమీ జాక్సన్ జంటగా నటించారు. మలయాళ నటి నిమిషా సజయన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాను 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. స్టంట్ సిల్వ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఫైట్స్ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని యూనిట్ తెలిపింది. త్వరలోనే ట్రైలర్, ఆడియో ఈవెంట్ల తేదీలను ప్రకటిస్తామన్నారు.

నటీనటులు: అరుణ్ విజయ్, అమీ జాక్సన్, నిమిషా సజయన్, అబి హాసన్, భరత్ బొపన్న, బేబీ ఇయాల్, విరాజ్ ఎస్, జాసన్ షా తదితరులు
దర్శకత్వం: విజయ్
నిర్మాతలు: సుభాస్కరన్, ఎం రాజశేఖర్, ఎస్ స్వాతి
కో ప్రొడ్యూసర్: సూర్య వంశీ ప్రసాద్ కోత, జీవన్ కోత
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్
స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే: ఎ.మహదేవ్
డైలాగ్స్: విజయ్
సినిమాటోగ్రఫీ: సందీప్ కె.విజయ్
ఎడిటర్: ఆంథోని
స్టంట్స్ సిల్వ
ఆర్ట్ డైరెక్టర్: శరవణన్ వసంత్
కాస్ట్యూమ్స్: రుచి మునోత్
మేకప్: పట్టనం రషీద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వీ గణేష్
ప్రొడక్షన్ కంట్రోలర్: కే మణి వర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ (యుకె): శివ కుమార్, శివ శరవణన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మనోజ్ కుమార్.కె
కాస్ట్యూమర్: మొడేపల్లి రమణ
సౌండ్ డిజైన్: ఎంఆర్ రాజశేఖరన్
వీఎఫ్‌ఎక్స్: డినోట్
స్టిల్స్: ఆర్‌ఎస్ రాజా
ప్రమోషన్, స్ట్రాటజీస్: షియం జాక్
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ , ఫణి కందుకూరి (బియాండ్ మీడియా),
పబ్లిసిటీ డిజైనర్: ప్రతూల్ ఎన్.టి.


Click it and Unblock the Notifications











