దుమ్ము రేపుతున్న వేలైక్కారన్ సాంగ్: అంచనాలని పెంచేసింది, మరో హిట్ పడ్డట్టే

శివ‌కార్తీకేయ‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం 'వేలైక్కార‌న్‌'. 'జ‌యం' రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, అనిరుధ్ సంగీత‌మందిస్తున్న‌ ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 22న 'వేలైక్కార‌న్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 24ఎఎం స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాటమాత్రం ఇప్పుడు తమిళనాడులో సంచలనం అయ్యింది. అనిరుధ్ తరహా మాస్ బీట్ తో సాగే ఈ పాట ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ క్రేజీ ట్రాక్‌గా మారి పోయింది. అసలే ఈ సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలని "ఎజు వేలక్కరా" అంటూ సాగిపోయే ఈ సాంగ్ మరింత పెంచేసింది. శివకార్తికేయన్ కెరీర్ లో ఇప్పుడు వేలైక్కారన్ మరో రికార్ద్ అవుతుందన్న టాక్ ఉంది ఇప్పటికైతే..

Lyrical Video Of Ezhu Velaikkara from Velaikkaran Is Out

ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సినిమా పూర్తికాక పోవడం, పోస్టు ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో సినిమా రిలీజ్ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్, నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీష్, ఆర్.జె బాలాజీ తదితరులు నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా ఇంతకు ముందు తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ 'తని ఒరువన్' చిత్రాన్నికి దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X