పదహారు భాషల్లో ఇలియానాని పొగుడుతూ పాట
ఆమధ్య హిందీలో వచ్చి హిట్టయిన 'త్రీ ఇడియట్స్' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్, ఇలియానా, జీవా, శ్రీకాంత్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోయంబత్తూర్‌లో జరుగుతోంది.ఇక ఈ చిత్రంలో వెరైటీ సాంగ్ ని ప్లాన్ చేసారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో కలిపి మొత్తం పదహారు భాషల్లో ఈ పాట సాగుతుంది.
విజరు ప్రకాష్ పాడగా, సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ ఇటీవలే రికార్డ్ చేశాడు. దీనిని ప్రపంచంలోని వివిధ దేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక పాటను ఇలియానా, విజయ్ ల కాంబినేషన్ లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.ఇలియానా అందాలను అన్ని భాషల్లో పొగడటమే ఆ పాట లక్ష్యం అని చెప్తున్నారు.ఈ చిత్రం తమిళంలో 'నన్బన్'కాగా, తెలుగులో 'త్రీ రాస్కెల్స్'గా నిర్ణయించారు. జెమినీ ఫిలీం సర్క్యూట్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











