రికార్డు సృష్టిస్తున్న రామ్ చరణ్ కి బ్రహ్మరథం..!

By Sindhu

తెలుగులో రికార్డు కలెక్షన్స్ సాధిచి చిరిత్ర సృష్టించిన రామ్ చరణ్, రాజమౌళిల 'మగధీర" చిత్రం తెలుగు చిత్ర పరిశ్రలోని మునుపటి రికార్డులు మొత్తం తుడిచి పెట్టేసిన రామ్ చరణ్ ఇప్పుడు మరో రికార్డుని కూడా వశం చేసుకున్నాడు. ఇటీవలే తమిళంలో విడుదలైన మగధీర అనువాదమైన 'మావీరన్" ఆరు కోట్లకి పైగా షేర్ రాబట్టి తమిళనాట తెలుగు చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో అరుంధతి పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు మావీరన్ తో తుడిచిపెట్టుకుపోయింది. ఈ చిత్రానికి కేవలం కోటీ యాభైలక్షలతో చాలా రిచ్ గా డబ్ చేయగా 6కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రామ్ చరణ్ ఫెర్ ఫార్మెన్స్ కి , రాజమౌళి టేకింగ్ కి తమిళ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ఫ్రెష్ గా రిలీజయిన శక్తికి కూడా సాధ్యం కానిది రెండేళ్లు పాతబడిపోయిన మగధీర వల్లయింది. ఇదే సినిమా రెండేళ్ల క్రితమే విడుదలై ఉంటే తమిళ హిట్టకి ధీటుగా వసూళ్లు ఉండేవనడంలో అతిశయోక్తి లేదు.ఏదేమైనా చూడదగ్గ సినిమాలైతే తెలుగు అనువాదానికి కూడా తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారని అరుంధతి, మగధీర నిరూపించాయి.

మగధీర పేరిట నమోదైన రికార్డుల్లో కొన్ని...
టాప్ గ్రాసర్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ
అత్యధిక శతదినోత్సవ కేంద్రాలు
అత్యధిక అర్థ శతదినోత్సవ కేంద్రాలు
నైజాంలో ఇరవై కోట్లకి పైగా షేర్ సాధించిన ఏకైక చిత్రం
ఒకే సెంటర్ లో అత్యధిక రోజులు ప్రదర్శింపబడ్డ చిత్రం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X