twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు 58 శాతమే వచ్చింది.. సీబీఎస్‌ఈ ఫలితాలపై రొమాంటిక్ హీరో కామెంట్

    |

    తాజాగా సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జరగుతోంది. కరోనా సమయంలో పరీక్ష ఫలితాలు రావడంపై కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నందున సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించాడు. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన చింతించాల్సిన అవసరం లేదని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ప్రధాని చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

    సీబీఎస్‌ఈ ఫలితాలు వచ్చాయి.. పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, వారి రాబోవు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా మరో ట్వీట్ చేస్తూ.. సీబీఎస్‌ఈ ఫలితాల వల్ల ఎవరైనా అసంతృప్తికి లోనట్టైతే వారి గురించి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఒక్క పరీక్ష మీరెంటో, మీ ప్రతిభను నిర్వచించలేదు. మీ అందరికీ అంతులేని ప్రతిభ ఉంటుంది. నిరాశ చెందకండి, ముందుకు సాగండి.. మీరు అద్భుతాలు సృష్టిస్తారు' అని అందరిలోనూ స్ఫూర్తి నింపారు. అదే విధంగా హీరో మాధవన్ సైతం తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు.

    Madhavan About CBSE Board Exam Results

    సీబీఎస్‌ఈ ఫలితాల్లో తక్కువ మార్కులు లేదా ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు మాధవన్ ముందుకు వచ్చాడు. 'బోర్డ్ ఫలితాలు చూసుకున్న వారందరూ.. వారు ఊహించనట్టుగా, అంతకు మించి ఫలితాలు సాధించిన వారికి కంగ్రాట్స్.. మిగిలిన వారందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను.. నాకు బోర్డ్ ఎగ్జామ్స్‌లో 58 శాతమే వచ్చింది. మీ ఆట ఇంకా మొదలే కాలేదు ఫ్రెండ్స్' అంటూ చదువే సమస్తం కాదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు మాధవన్. మాధవన్ ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నాడు.

    English summary
    Madhavan About CBSE Board Exam Results. he says that To all those who just got their board results— congratulations to those who exceeded their expectations and aced it . Ok handOk handThumbs upThumbs up.. and to the rest I want to say I got 58% on my board exams.. The game has not even started yet my dear friends
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X