Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాధవన్‌తో సమంత.. కుదిరిన కెమిస్ట్రీ.. అదిరిపోయిన వీడియో
కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఇటు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో మాధవన్. చెలి, సఖి వంటి మ్యూజికల్ లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడు. ఈ మధ్య రూట్ మార్చి నచ్చిన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి చిత్రంలో నెగెటివ్ రోల్‌ను పోషించాడు. త్వరలో రాబోతోన్న అనుష్క నిశ్శబ్దంలోనూ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

ముఖ్య పాత్రల్లో నటిస్తూ..
సాలా కడ్డూస్ ( తెలుగులో గురు), విక్రమ్ వేదా లాంటి సినిమాల్లో మాధవన్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే సోలో హీరోగా అవకాశాలు తగ్గడంతో పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. చాలా రోజుల తరువాత సవ్యసాచి చిత్రంతో తెలుగులో నటించాడు. అయితే సవ్యసాచి ఫ్లాప్ కావడంతో మళ్లీ అవకాశాలు రాలేదు.

అనుష్క నిశ్శబ్దంలో..
అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తన్న నిశ్శబ్దం సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ ఓ ముఖ్య మైన పాత్రను పోషిస్తున్నాడు. మాధవన్ పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సైతం విపరీతంగా ఆకట్టుకుంది.
|
యాడ్స్‌లోనూ బిజీగా..
కొందరు హీరో, హీరోయిన్లు చేతి నిండా సంపాదిస్తున్నా.. ప్రకటనల్లో నటిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఈ జాబితాలో తెలుగు నుంచి మహేష్ బాబు, నాగార్జున వంటి వారు ముందుంటారు. సమంత కూడా పలు ప్రకటనల్లో నటిస్తూ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

సమంత-మాధవన్ కలిసి..
తాజాగా వీరిద్దరు కలిసి ఓ యాడ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కాసేపటి క్రితమే విడుదలైంది. ఏవీటీ అనే టీ గురించి చేసిన ఈ యాడ్‌లో వీరిద్దరు బాగానే ఆకట్టుకున్నారు. సమంత, మాధవన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్టు కూడా కనిపిస్తోంది. ఏవీటీ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు సమంత కామెంట్ చేసింది. సమంత ప్రస్తుతం జాను చిత్రంతో బిజీగా ఉంది.