మహేష్ బాబు అన్నయ్యగా ఆ స్టార్ హీరో!?
మహేష్ బాబు తర్వాత చేయబోయే చిత్రంలో అతని అన్నయ్యగా ఓ కీలకమైన పాత్రను చేయటానికి మాధవన్ ఒప్పుకున్నట్లు సమాచారం. రన్, పందెం కోడి, ఆవారా చిత్రాల ద్వారా తెలుగు పరిచయమైన లింగు స్వామి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ లో శింబు హీరోగా చేయనున్నాడు. అక్కడా మాధవన్..అన్న పాత్రలో అలరించనున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని నిర్మించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తమిళ వెర్షన్ మాత్రం జూలైనుంచే షూటింగ్ చేస్తారు. ఈ చిత్రం స్క్రిప్టుని లింగు స్వామి కూర్గులోని ఆరెంజ్ కంట్రీ అనే రిసార్టులో స్క్రిప్టు వర్క్ చేసారు. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం క్లైమాక్స్ షూటింగ్ హడావిడిలో ఉన్నాడు.
మాధవన్ మహేష్ బాబు తమన్నా కార్తీ ఆవారా లింగు స్వామి madhavan mahesh babu tamanna karthi linguswamy awara


Click it and Unblock the Notifications