కమల్ హాసన్,మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం నాయకుడు. ఈ చిత్రం రీమేక్ చేస్తే అందులో నటించాలని ఉందని తమిళ నటుడు మాధవన్ అన్నారు. ఆయన తాజా చిత్రం వెట్టై ప్రమోషన్ లో భాగంగా కలిసిన ఆయన ఇలా స్పందించారు. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన వెట్టై చిత్రం అక్కడ పొంగల్ కి విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. దాంతో చాలా గ్యాప్ తర్వాత తాను చేసిన తమిళ చిత్రం విజయవంతంగా ఆడటంపై చాలా హ్యాపీ ఫీలయ్యి మీడియాతో మాట్లాడారు. అలాగే ఇకనుంచి తాను తమిళ చిత్రాలకు సైతం తన డేట్స్ కేటాయిస్తానని,తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని తాను వదులుకోలేనని అన్నారు. అలాగే తను చెయ్యాలనుకున్న క్యారెక్టర్ కమల్ హాసన్ ..నాయకుడు చిత్రంలో చేసిన పాత్ర అని అన్నారు. ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తే తనకు ఆ పాత్ర ఇస్తే చాలా సంతోషపడతానని అన్నారు. అలాగే ప్రస్తుతం తను హిందీలో బిజీగా ఉన్నానని అన్నారు. తను,బిపాసా బసు కాంబినేషన్ లో చేసిన జోడీ బ్రేకర్స్ చిత్రం కూడా పెద్ద హిట్టు అవుతుందని నమ్మకం వ్యక్తం చేసారు. రొమాంటిక్ కామిడీగా రూపొందే ఆ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాక హిందీలో తన స్దానాన్ని సుస్దిరం చేస్తుందనే నమ్మకాన్ని వెల్లబుచ్చారు.